
అసలు విషయంలోకి వెళ్తే..కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పైన సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఈ విషయంలో వైసిపి పార్టీ నేత మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఆయన తమ్ముడు అహ్మద్ భాషా తో పాటుగా, పిఏ కాజా పై.. ఎమ్మెల్యే భర్తతో పాటు. శ్రీనివాసరెడ్డి తో కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ముగ్గురి పైన కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆధారాలతో కేసు నమోదు చేశారు. సిఐ రామకృష్ణ యాదవ్ ముగ్గురు పైన కేసు నమోదు చేయడం వల్ల , అలా కేసు నమోదు అయిందో లేదో గంటల వ్యవధిలోనే ఆ సీఐని వీఆర్లోకి పంపిస్తూ ఉత్తరులను జారీ చేశారు. ఈ విషయం పైన టిడిపి పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ డిప్యూటీ సీఎం, అతని సోదరుడి పైన కేసు వద్దనప్పటికీ కూడా నమోదు చేశారన్న కోపంతో ఏకంగా బదిలీ వేటు వేశారనే విషయం కూటమి అనుకూల మీడియాలో స్టోరీ రావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో కడప జిల్లా ఉన్నతాధికారులతో కడప ఎమ్మెల్యేకు చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అక్కడ అధికారులందరూ కూడా తమ మాట వినాలనే విధంగా ప్రవర్తిస్తున్నట్లు వినిపిస్తున్నాయి.కడప ఎస్పీపై బదిలీ లేట్ పడకపోతే అటు ఎమ్మెల్యే, ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి పరువు పోయేలా భావిస్తున్నారని..ఈ ఎమ్మెల్యే పైన అక్కడి ప్రజలను విశ్వాసం తగ్గుతుందని ఆమె మాట చెల్లాలని విధంగా చూస్తోందట. ముఖ్యంగా కడప ఎస్పీ అక్కడ ప్రజలలో బాగానే పేద సంపాదించారు. కడప ఎమ్మెల్యే పరువు మొత్తం ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడింది. కూటమెక్కి అనుకూలంగా ఉన్న ఇలాంటి పరిస్థితి అంటూ అక్కడ టిడిపి వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.