మెగాస్టార్ చిరంజీవి ఎన్నో హిట్టు సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించాడు. అలా చిరంజీవి కెరీర్ లో ఉన్న మంచి సినిమాలలో 1995లో విడుదలైన 'కొదమసింహం'  ఒకటి. ఈ సినిమా గురించి ప్రముఖ తెలుగు రచయిత పరుచూరి గోపాలకృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. పరుచూరి గోపాలకృష్ణ మాటల ప్రకారం కే మురళి మోహన్ దర్శకత్వంలో కైకాల నాగేశ్వరరావు ప్రొడ్యూసర్ గా చిరంజీవి హీరోగా ఒక సినిమా కథ తయారవుతుంది. దానికి సత్యానంద్ మాటలు రాస్తున్నాడు.

 అప్పటి వరకు మాకు ఆ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే ఒకరోజు సడన్ గా మా ఇంటికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. దానిని మా మూడో అమ్మాయి హరిప్రియ లిఫ్ట్ చేసి మాట్లాడినప్పుడు నేను చిరంజీవి ని మాట్లాడుతున్నాను అని అన్నారు. దానితో నేను ఇది ఏదో ఫ్రాంక్ ఫోన్ కాల్ అని అనుకున్నాను. తర్వాత నేను ఫోన్ మాట్లాడాను అవతల వ్యక్తి నిజంగానే చిరంజీవి ఏంటి సార్ మీరే నేరుగా ఫోన్ చేశారు అని అడిగాను 'కొదమ సింహం' కథ వేరే వాళ్ళు తయారు చేశారు. సంభాషణలను సత్యానంద్ గారు రాస్తున్నారు. కథ వింటుంటే నాకు అందులో ఏదో దోషం ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ కథను మీరు విని అందులో ఏమైనా తప్పు ఉందా..లేదా..ఉంటే సరి చేయండి..స్క్రీన్  ప్లే మీ పేరు వేస్తాము , ఎలాంటి దోషము లేనట్లయితే మేము ప్రొసీడ్ అవుతాను అని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత కథను నేను విన్నాను అందులో దోషం నాకు అర్థమైంది. సినిమా మొదట వారు రాసుకున్న కథ ప్రకారం మోహన్ బాబు చేసిన సుడిగాడు పాత్ర ఇంటర్వెల్ లోనే చనిపోతుంది. చిరంజీవి తల్లిదండ్రుల గురించి తెలిసిన ఏకైక వ్యక్తి మధ్యలో చనిపోవడం. ఆ తర్వాత చిరంజీవి వారి కోసం వెతుకులాటడం ఇది అంతా బాగుండదు అని మేము చెప్పాము. దానికి దర్శకుడు కూడా ఒప్పుకోవడం ఆ తర్వాత చిరంజీవికి ఈ కథలో ఉన్న దోషాన్ని వివరించాము దానికి చిరంజీవి గారు కూడా ఒప్పుకొని ఒక వేళ సుడిగాలి పాత్ర బ్రతికి ఉంటే ఎలా ఉంటుందో దానిని తయారు చేయండి. స్క్రీన్ ప్లే మీ పేరు వేస్తాం అని అన్నాడు. ఇలా చిరంజీవి హీరో గా నటించిన 'కొదమసింహం' సినిమా వెనుక ఉన్న విషయాలను కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: