సినిమాలంటేనే కేవలం కథ కథనం బాగుంటే సరిపోదు.. కంటెంట్ తో పాటు నటీనటుల నటన కూడా బాగుండాలి.. కామెడీ అయినా.. రొమాన్స్ అయినా.. హార్రర్ అయినా..మాస్ అయినా.. ఏదైనా సరే ప్రేక్షకులను మెప్పించగలగాలి. అంతేకాదు రచయితలు కూడా హీరోహీరోయిన్ల కు రాసే డైలాగులు కూడా ఒకసారి సినిమాకు హైప్ ను పెంచుతాయి. అలా మన స్టార్ హీరోలందరి సినిమాలలో కూడా రచయితలు బహు జాగ్రత్తలు తీసుకుంటూ హీరోలకు డైలాగులు రాస్తూ..ఆ డైలాగులతోనే విజయాన్ని అందుకుంటారు.. అంతేకాదు ఈ డైలాగులు బాగా ప్రేక్షకులలోకి వెళ్లి ప్రేక్షకులు కూడా వీటిని అనుసరించే విధంగా ఉంటాయి..



అలా ఈ మధ్యకాలంలో బాగా పుట్టుకొచ్చిన డైలాగ్ కూడా ఒకటి ఉంది.. ఈ డైలాగుతో అల్లు అర్జున్ కెరీర్ మారిపోయిందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ఆ డైలాగ్ ఏదో గుర్తొచ్చే ఉంటుంది. అదేనండీ..! రేసుగుర్రంలో అల్లు అర్జున్ మాట్లాడే డైలాగ్  దేవుడా..! ఈ డైలాగ్ ఎంతగా పాపులర్ అయ్యింది అంటే ఇప్పటికీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ డైలాగుతో చాలామంది చాలా రకాల సంభాషణలు చేస్తూ హైలెట్ గా నిలుస్తారు.. ఇది సాధారణమైన వాక్యమే అయినప్పటికీ అల్లు అర్జున్ మాట్లాడేది స్టైల్ .. అతని ఉచ్చారణలో వచ్చే స్టైల్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ డైలాగుతో ఫుల్ సినిమా మంచి విజయాన్ని కూడా అందుకుందని చెప్పవచ్చు.


ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ వెంకటేశ్వరరావు, నల్లమలపు  శ్రీనివాసరావు కలిసి సంయుక్తంగా తెర కెక్కించిన సినిమా రేసుగుర్రం. ఈ సినిమాలో అల్లు అర్జున్ , శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించగా రవి కిషోర్, బ్రహ్మానందం , ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2014 ఏప్రిల్ 11 వ తారీకు న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక కమర్షియల్ హిట్ గా కూడా  నిలిచి, విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: