ఉద‌య్ కిర‌ణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అంచ‌లంచ‌లుగా ఎదిగి స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకున్న దివంగ‌త న‌టుడు ఉద‌య్ కిర‌ణ్‌.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `చిత్రం` సినిమాతో తొలిసారి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఆ త‌ర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే చిత్రాల్లో న‌టించ‌గా.. మొద‌టి మూడు చిత్రాలు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. హ్యాట్రిక్ విజయాలతో ఉదయ్ కిరణ్ పేరు మార్మోగింది.

ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన ఈయ‌న‌.. అన‌తి కాలంలో స్టార్ హోదాను ద‌క్కించుకుని భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అలాగే కమల్ హాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే నంది అవార్డు అందుకున్న హీరోగా ఉద‌య్ కిర‌ణ్ రికార్డు సృష్టించారు. అయితే ఎంత వేగంగా అగ్ర స్థానానికి చేరుకున్నాడో అంతే వేగంగా ఉద‌య్‌ కిర‌ణ్ కిందకి పడిపోయాడు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. ఉయ‌ద్ కిర‌ణ్ కెరీర్ పీక్స్‌లో కొన‌సాగుతున్న స‌మ‌యంతో.. ఆయ‌న్ను త‌న ఇంటి అల్లుడిని చేసుకోవాల‌ని మెగాస్టార్ చిరంజీవి భావించారు.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మితతో ఉయ‌ద్ కిర‌ణ్‌కి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ, అనుకోని కార‌ణాల వ‌ల్ల వీరి పెళ్లి ఆగిపోయింది. దాంతో మెగాస్టార్ కుటుంబానికి ఉదయ్ కిరణ్ కి మధ్య మాటలు లేవు. ఇక అప్ప‌టి నుంచీ ఉద‌య కిర‌ణ్‌కు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే అవ‌కాశాలు క్ర‌మంగా త‌గ్గిపోయాయి.

మ‌రోవైపు చిరంజీవి ఫ్యాన్స్ ఉద‌య్ కిర‌ణ్‌కి ఫోన్ చేసి నానా మాట‌లు అంటూ తీవ్రంగా ఇబ్బంది పెట్టేవార‌ట‌. దాంతో ఆయ‌న ఎంతో ఆవేద‌న చెందార‌ని అప్ప‌ట్లో ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలీదు. కాగా, ఉదయ్ కిరణ్ 5 జనవరి 2014న హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: