మ్యాచో మ్యాన్ గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల రాసి రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతున్న గోపీచంద్ కు ఈ సినిమా విజయం తప్పనిసరి అయ్యింది. ఆయన నటించిన గత సినిమా సిటీ మార్ పర్వాలేదు అనిపించుకోగా ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అందుకే ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేసే దర్శకుడైన మారుతి తో కలిసి ఆయన ఈ సినిమాను చేశాడు. ఈ చిత్రంలో లాయర్ గా నటిస్తున్న గోపీచంద్ ను సరికొత్త స్టైల్లో మారుతి ఆవిష్కరించినట్లూగా అప్డేట్ లను బట్టి తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్ లు ప్రేక్షకులలో సినిమా పట్ల మంచి అంచనాలను ఏర్ప రిచింది. ముఖ్యంగా గోపీచంద్ ను ఏ విధంగా దర్శకుడు చూపించాడో అన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది. మరి  జూలై 1 న విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చూద్దాం. 

వాస్తవానికి జూలై నెల గోపీచంద్ కు కలిసొచ్చే నెల అనే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఈ నెలలో ఆయన పలు సినిమాలను విడుదల చేయగా అవి ఆయ నకు మంచి సక్సెస్ ను తెచ్చిపెట్టాయి. ఆ విధంగా పోల్చుకుంటే గోపీచంద్ తప్పకుండా ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటాడు అని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాక్షన్ హీరోగా ఇన్నాళ్లు ప్రేక్షకులను అలరించిన గోపీచంద్ ఇప్పుడు ఈ సినిమాలో పోషిస్తున్న పాత్రలతో ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో గోపీచంద్ హాస్యాన్ని కూడా తనదైన స్టైల్ లో పండించబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: