టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందారు సూర్య. విభిన్నమైన పాత్రలలో ఎంతో మంది ప్రేక్షకులను గెలుచుకున్న సూర్య విక్రమ్ సినిమాలో గెస్ట్ రోలుగా నటించి అందర్నీ ఆకర్షించారు. ఇక తాజాగా ఆకాశమే నీ హద్దురా వంటి సినిమాకి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇక జై భీమ్ వంటి చిత్రంతో సూర్య నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారని చెప్పవచ్చు. ఇందులోని నటన అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నది. అయితే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సూర్య సినిమాల ద్వారా బాగానే ఆస్తులు సంపాదించినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.


సూర్య ఎంత సంపాదించినప్పటికీ అందులో కొంత మొత్తాన్ని పలు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం సూర్య కు రూ.200 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు సమాచారం ఒక్కో సినిమాకు సూర్య దాదాపుగా రూ.25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. అయితే తను ఏదైనా బ్రాండ్ గురించి ప్రచారం చేయాలి అంటే రూ.2 కోట్ల రూపాయలను తీసుకుంటారట. సూర్యకు కార్లు అంటే చాలా ఇష్టము కాదా సూర్య గ్యారేజ్ లో ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నట్లు సమాచారం.


ఇక సూర్య కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన 1997 సంవత్సరంలో తన నటుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఇక 2006వ సంవత్సరంలో హీరోయిన్ జ్యోతికను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సూర్య జ్యోతిక కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక వీరిద్దరికి దియా, దేవ్, అనే పేర్లు గల కొడుకు, కూతురు ఉన్నారు. జ్యోతిక కూడా ఆడప దడపా సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఇక సూర్య సోదరుడు కూడా కార్తి హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఈ ఇద్దరు కూడా విభిన్నమైన కథలతో ఎల్లప్పుడూ ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: