ఇక టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో  యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2 సినిమా ఒకటిగా నిలుస్తుంది. ఈ చిన్న సినిమా పాన్ ఇండియా లెవెల్లో సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే.బాలీవుడ్ లో నామమాత్రంగా రిలీజై రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. విడుదలైన నెల తర్వాత కూడా హౌస్ ఫుల్స్‌తో రన్ అవడం అంటే మామూలు విషయం కాదు.ఈ సినిమా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి.. మొత్తం 125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి స్టార్ హీరోలకు సైతం పెద్ద షాక్ ని ఇచ్చింది.ఇంకా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా నిఖిల్ ని స్టార్ హీరోగా కూడా మార్చేసింది.ఈ సినిమా విడుదల కాకముందే దీనికి సీక్వెల్ తీసే ఉద్దేశంతో ఉన్నారు హీరో కార్తికేయ, దర్శకుడు చందూ మొండేటి. ఇక సినిమా అంత పెద్ద సక్సెస్ అయ్యాక ఎందుకు ఆగుతారు?కార్తికేయ పాత్రను పెట్టి ఎన్ని సినిమాలైనా తీయడానికి స్కోప్ ఉండేలా ఫ్లాట్ ఫామ్ రెడీ చేసేశాడు దర్శకుడు చందూ. 


కార్తికేయ-3 విషయంలో తగ్గేదే లేదని నిఖిల్ కూడా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కార్తికేయను మించి కార్తికేయ-2 పెద్ద సక్సెస్ అయిందని.. ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహంతో, వారి దీవెనలతో కార్తికేయ-3 తీయబోతున్నామని.. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అనే క్యూరియాసిటీతో తాను ఉన్నట్లు హీరో నిఖిల్ చెప్పాడు.ఈసారి ఇంకా పెద్ద కాన్వాస్‌లో, త్రీడీలో సినిమా చేయబోతున్నట్లు కూడా నిఖిల్ వెల్లడించాడు. కార్తికేయ-2లోనే మూడో భాగం గురించి హింట్ కూడా ఇచ్చారు. ఈసారి హీరో ఇంటర్నేషనల్ లెవెల్‌కు వెళ్లబోతున్నాడు. కథ దేశ విదేశాల్లో నడవబోతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.మరి చూడాలి కార్తికేయ 3 ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: