టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి  నటసింహం బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా షూటింగ్ క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది.ఇక ప్రస్తుతం ఇస్తాన్ బుల్ లో విలన్ గా నటిస్తున్న దునియా విజయ్ తో పాటు కీలక తారాగణం పాల్గొనగా యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు.అయితే  విడుదల తేదీ విషయంలో అభిమానులలో నెలకొన్న సందిగ్దతకు ఈ దసరా పండగ చెక్ పెట్టే అవకాశాలున్నాయి. ఇకపోతే బ్యానర్ వ్యవహారాల గురించి అంతగా అవగాహన లేని వాళ్ళు చిరంజీవి వాల్తేర్ వీరయ్య(టైటిల్ ప్రకటించలేదు) తో

 2023 సంక్రాంతి బరిలో ఈ సినిమా పోటీ పడుతుందని సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో పోస్టులు  పెడుతున్నారు. ఇక ఆ అవకాశం ఎంత మాత్రం లేదు.అయితే  రెండు సినిమాల నిర్మాణ సంస్థ ఒకటే అయినప్పుడు ఎంత అనివార్యమైనా సరే అలాంటి రిస్క్ చేయరు. ఇక అందులోనూ చిరు బాలయ్య లాంటి సీనియర్లతో. అయితే ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ NBK 107ని డిసెంబర్ 23 రిలీజ్ చేయడం దాదాపు ఖరారేనట.అయితే  బాలకృష్ణ అంతా సరిచూసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే విజయదశమి రోజు అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఇదిలావుంటే నిజానికి ఆ డేట్ కి విజయ్ దేవరకొండ ఖుషీ రావాలి.  

అది ఆల్రెడీ వాయిదా పడింది. అఖిల్ ఏజెంట్ అనుకున్నారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.కాబట్టి  బాలయ్య సోలో అడ్వాంటేజ్ తీసుకుని బరిలో దిగే అవకాశం ఉంది.ఇక  అదే సమయంలో రణ్వీర్ సింగ్ సర్కస్, లారెన్స్ రుద్రుడులు ఉన్నాయి కానీ వాటిని పోటీగా పరిగణించాల్సిన అవసరం లేదు. అయితే టైటిల్ గా ఏవేవో ప్రచారాలు జరుగుతున్నాయి కానీ యూనిట్ ఏదీ లీక్ చేయడం లేదు.ఇక  జై బాలయ్య, అన్నగారు, రెడ్డిగారు అని రకరకాల పేర్లు ఫ్యాన్స్ మధ్య తిరగడమే తప్ప ఫైనల్ గా ఏది లాక్ చేస్తారో ప్రస్తుతానికి సస్పెన్సే.ఇదిలావుంటే  శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యాక్షన్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ కు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది. ఇక అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత రిపీట్ అవుతున్న కాంబో మరి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: