కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న ఈ హీరో ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి వాటితో మంచి విజయాలను అందుకొని ,  ప్రస్తుతం ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ దర్శకులలో ఒకరు అయిన అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రిన్స్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తమిళ్ మరియు తెలుగు భాషలలో తెరకెక్కించారు. 

మూవీ ని తమిళ్ మరియు తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ప్రకటనను మూవీ యూనిట్ చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోయే ముఖ్య అతిథులకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ప్రిన్స్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 18 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ సెంటర్ , హైదరాబాద్ లో జరగనున్నట్లు , అలాగే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలు అయినా విజయ్ దేవరకొండ ,  దగ్గుపాటి రానా , అలాగే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథులుగా రానట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: