ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా సినిమాఇండస్ట్రీలో కి  అడుగుపెట్టి అల్లరి సినిమాతో హీరోగా మారాడు అల్లరి నరేష్‌. ఇక మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న అల్లరోడు తన కామెడీ సినిమాలతో విశేషమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.అయితే విభిన్నమైన చిత్రాలలో నటించి ఫుల్ పాపులర్ అయ్యాడు.ఇక  ఆయన నటించిన నేను, నాంది సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో అతని పేరు మోరుమ్రొగింది.ఇకపోతే  హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇప్పటికీ 50కిపైగా చిత్రాల్లో నటించి తనదైన శైలీలో సత్తా చాటుతున్ననరేష్

 ఇటీవల కాలంలో కామేడీ చిత్రాలు తగ్గించి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.ఇదిలావుంటే ఇక  తాజాగా అల్లరి నరేష్ విలక్షణ చిత్రం అయిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని హస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ నిర్మించగా, ఇందులో ఆనంది హీరోయిన్‌గా నటించింది. అయితే శ్రీచరణ్ పాకాల దీనికి సంగీతం అందించారు. ఇక ఇందులో ప్రవీణ్, వెన్నెల కిశోర్, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.

కాగా  ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి.ఇకపోతే సుడిగాలి సుధీర్ రేంజ్ సినిమా కన్నా దారుణంగా అల్లరి నరేష్ సినిమా కలెక్షన్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే ఓ వైపు డబ్బింగ్ సినిమా లవ్‌టుడే దూసుకుపోతుండడా, కేవలం మూడు రోజులకే రు. ఇక 8 కోట్ల నెట్ వసూళ్లతో మారేడుమిల్లి సినిమాను కోలుకోనివ్వకుండా చేసింది.అంతేకాదు  ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రు 2.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది.  ఇది కష్టమే అని కొందరు అంటున్నారు. నరేష్ ఇలా మూస కథలతో ముందుకు సాగితే కొద్ది రోజులలో కెరీర్ కి గుడ్ బై చెప్పక తప్పదు.లేదంటే ఇక  మహర్షిలో మాదిరిగా సైడ్ క్యారెక్టర్స్ వేసుకోవల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.అయితే  రానున్న రోజులలో అయిన కథల ఎంపికలో జాగ్రత్తలు వహించాలని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: