కోలీవుడ్ అగ్ర హీరో అజిత్ కి సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా టాలీవుడ్ లో అజిత్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఇక ఇటీవల 'వాలీమై' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్.. ఇప్పుడు 'తునివు' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాని తెలుగులో 'తెగింపు' పేరుతో విడుదల చేస్తున్నారు. హెచ్ వినోద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో అజిత్ సరికొత్త అవతారంలో మెరవడంతో ఫాన్స్ అయితే ట్రైలర్ తో పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో జనవరి 12న విడుదల కాబోతోంది.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అజిత్ కు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచమంతా ఎంతలా వ్యాపించిందో తెలిసిందే. సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని వినియోగిస్తూ ఉంటారు. కానీ హీరో అజిత్ మాత్రం అలా కాకుండా సోషల్ మీడియాకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కనీసం ఇప్పటివరకు ఆయనకు ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతా కూడా లేదంట. నమ్మశక్యంగా లేదు కదా? కానీ ఇది నిజం. అంతెందుకు ఆయనకు పర్సనల్ మొబైల్ కూడా లేదట. ఇదే విషయాన్ని హీరోయిన్ త్రిష గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించింది.

మీ మొబైల్ లో అజిత్ సర్ నంబర్ ని ఏమని సేవ్ చేశారు అని అడగ్గా.. తన ఫోన్లో అజిత్ సర్ నంబర్ లేదని.. ఎందుకంటే అజిత్ సర్ అసలు ఫోన్ వాడారని చెప్పుకొచ్చింది. అయితే ఆయన ప్రజలు, అభిమానులు, సినీ ప్రముఖులతో ఎలా కమ్యూనికేట్ అవుతారు అని ప్రశ్నించగా?.. అందుకు త్రిష సమాధానమిస్తూ.. తన వెంటే ఉండే మేనేజర్ అన్ని విషయాలకు సంబంధించిన అప్డేట్స్ అజిత్ సర్ కి అందిస్తారని.. అందుకే అజిత్ సర్ ఫోన్ వాడరని త్రిష ఇంటర్వ్యూలో పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియా వేదికగా అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి. తమిళ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉండే అజిత్ కనీసం ఫోన్ కూడా వాడకపోవడంతో ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. అంతేకాదు అజిత్ సింప్లిసిటీని ఈ సందర్భంగా కొనియాడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: