టిడిపి పార్టీ అంటేనే టక్కున గుర్తుకు వచ్చేది సీనియర్ ఎన్టీఆర్. ఆయన పార్టీని స్థాపించి కేవలం సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చారు. అలాంటి ఎన్టీఆర్ వారసులుగా రాజకీయాల్లోకి వచ్చింది బాలకృష్ణ, హరికృష్ణలు మాత్రమే.. వీళ్ళు ఓవైపు తండ్రి నుండి వచ్చిన సినీ ఫీల్డ్ ను కొనసాగిస్తూనే మరోవైపు రాజకీయాలను కూడా శాసించారు. ఇక హరికృష్ణ మరణించినప్పటికీ బాలకృష్ణ ఇప్పటికే హిందూపూర్ లో మూడవసారి గెలిచి  రికార్డు సృష్టించారు. ఈ విధంగా టిడిపి పార్టీలో ఎంతో సీనియర్ గా ఉన్నటువంటి బాలకృష్ణ మంత్రి పదవి మాత్రం చేపట్టలేదు.. మరి ఈసారైనా ఆయనకు మంత్రి పదవి వస్తుందా లేదా అనేది చూద్దాం.. ప్రస్తుతం టిడిపిలో బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలనే చర్చ ప్రారంభమైంది.. మొన్నటికి మొన్న చిరంజీవిపై బాలయ్య చేసిన కొన్ని ఆరోపణలతో బాలకృష్ణ చిరంజీవి అభిమానుల మధ్య కాస్త రచ్చ మొదలైంది. 

ఈ క్రమంలోనే బాలకృష్ణకు మంత్రి పదవి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఈ విధంగా మంత్రి పదవుల గురించి మాట్లాడాల్సి వస్తే మంత్రి పదవి బాలకృష్ణ కంటే ముందు నాగబాబుకి కూడా ఇవ్వాల్సి వస్తుంది. వీరిద్దరిలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నా ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరినో ఒకరిని మధ్యలో దింపేయాలి. కానీ చంద్రబాబు నాయుడుకి ఆ ఆలోచన ఉన్నట్టయితే అసలు కనిపించడం లేదు.. కానీ సోషల్ మీడియాలో బాలకృష్ణకు మంత్రి పదవి అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే తరుణంలో బాలకృష్ణ కూడా మంత్రి పదవి పై పెద్దగా ఆశ ఉన్నట్టయితే కనిపించడం లేదు. ఎందుకంటే మా నాన్నే సీఎం చేశారు. నాకు మంత్రి పదవి తీసుకోవడం పెద్ద లెక్క కాదు అని బాలకృష్ణ భావిస్తారట.. తనకు మంత్రి పదవి కావాలంటే ఆయనే డైరెక్ట్ గా చెప్పవచ్చు.

 ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే బాలకృష్ణ కి ఇలా దొంగ చాటుగా వచ్చి మంత్రి పదవి తీసుకునే కర్మేం లేదు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ మంత్రి పదవి పై ఆయనకు పెద్దగా వ్యామోహం లేదని మాత్రం అర్థం అవుతుంది. కానీ అభిమానులు మాత్రం ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి అని కోరుకుంటున్నారు.. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా తన అన్న నాగబాబుకు మంత్రి పదవితో పాటు ఏఎం రత్నం కి ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్  పదవి ఇప్పించాలని చూస్తున్నారు. కానీ ఈ రెండు ఇప్పటివరకు సాధ్యం కాలేదు. చంద్రబాబు పవన్ ఇద్దరూ కూర్చున్నప్పుడు కూడా వీటి గురించి పెద్దగా చర్చించినట్లు కూడా కనిపించడం లేదు.. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు మాత్రం మంత్రివర్గ విస్తరణ పై ఇప్పుడైతే ఎలాంటి ఆలోచన చేసినట్టయితే కనిపించడం లేదు.. ఒకవేళ ఫ్యూచర్లో టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తే బాలయ్య మంత్రి పదవి కావాలని అడిగితే తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: