
ఈసారి సంక్రాంతి చాలా క్రేజీగా సాగింది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి.. మరొకవైపు నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో దాదాపు 7 సంవత్సరాల తర్వాత మళ్లీ బరిలో దిగారు. దిగ్గజ హీరోలు తమకు అచ్చొచ్చిన జానర్స్ లో మూవీ చేయడం నిజంగా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య కూడా తనదైన నటనతో అలరించాడు. అదే సమయంలో వాల్తేరు వీరయ్య కూడా వింటేజ్ అవతార్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇదిలా ఉండగా ఇద్దరు ఒకరంటే ఒకరు అన్నట్లుగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. ముఖ్యంగా నాలుగు రోజుల కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరు టాప్ లో నిలిచారు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. అసలు విషయాల్లోకి వెళ్తే.. బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేసిన వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. మొదటి రోజు రూ.54 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమా బాలయ్య సినీ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అయితే ఓవరాల్ గా సినిమా విడుదలైన నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే కేవలం రూ. 104 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా మొదటిరోజు కేవలం రూ.34.85 కోట్లు రాబట్టిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 108 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి మరో అరుదైన రికార్డు సృష్టించింది. మొత్తంగా చూసుకుంటే బాలయ్య సినిమా కంటే చిరంజీవి సినిమా సంక్రాంతి విజేతగా నిలిచిందని చెప్పవచ్చు మరి రాబోయే రోజుల్లో లెక్కలు మారిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా ఇద్దరు స్టార్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడి మరి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడం జరిగింది.