ఎంతో మంది హీరోయిన్లు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతారు..అందం మరియు అభినయం ఉండి కూడా మిగిలిన టాప్ హీరోయిన్స్ లాగ పాపులర్ మాత్రం కాలేకపోతారు.అలా మనం వాళ్ళని చూసినప్పుడు ఎదో ఒక సందర్భం లో అయితే అనుకొనే ఉంటాము.అలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీ లో చాలా మంది అయితే ఉన్నారు, వారిలో ఒకరు కీర్తి చావ్లా.

జూనియర్ ఎన్టీఆర్ - వీవీ వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆది' సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ కూడా తెలిసిందే.అప్పటి వరకు కేవలం ఒక మామూలు హీరో గా మాత్రమే కొనసాగిన ఎన్టీఆర్ ని స్టార్ హీరో ని చేసింది ఈ సినిమా..ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఎన్టీఆర్ పేరు ఎత్తితే పూనకాలు వచ్చి ఊగిపోయ్యే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని అయితే తెచ్చి పెట్టింది ఈ సినిమా.

ఎన్టీఆర్ మరియు వినాయక్ తో పాటుగా ఈ సినిమాలో నటించిన ప్రతీ ఆర్టిస్టుకి కూడా గొప్ప అవకాశాలు వచ్చాయి, ఒక్క కీర్తి చావ్లా కి మాత్రం రాలేదు..ఈ సినిమా విడుదలైన తర్వాత ఆమె మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుందని అందరూ అనుకున్నారు..కానీ ఈమెకి అదృష్టం అయితే కలిసి రాలేదు.2016 వ సంవత్సరం వరకు సినిమాల్లో నటించింది కానీ, కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిమాత్రం ట్ ఒక్కటి కూడా లేదు.సినిమాలకు దూరం అయ్యినప్పటికీ సోషల్ మీడియా ద్వారా బాగా యాక్టీవ్ గానే ఉంటుంది.

తెలుగు లో ఈమె ఇది వరకు కేవలం నాలుగు సినిమాల్లో మాత్రమే నటించిందనీ తెలుస్తుంది., మిగిలిన మూడు సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా ఎవ్వరికి అస్సలు తెలియదు.అయితే ఈమె లేటెస్ట్ ఫోటోలు ఈమధ్య సోషల్ మీడియా లోబాగా వైరల్ గా మారాయి..అంతే కాదు ఇటీవలే ఈమె కలియుగ దేవుడు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: