తమిళ సినిమా ఇండస్ట్రీ లో తలపతి విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ హీరో ఈ సంవత్సరం వారిసు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాలతో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించింది. ఈ మూవీ తో విజయ్ మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇలా వారిసు మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న విజయ్ ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో అనే భారీ యక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా ఈ మూవీ షూటింగ్ 50% కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో త్రిష ... విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ క్రేజీ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న లియో మూవీ లో ఒక కీలకమైన పాత్రలో మొదట సాయి పల్లవి ని తీసుకోవాలి అని ఈ మూవీ యూనిట్ అనుకుందట ... అందులో భాగంగా సాయి పల్లవి ని ఈ చిత్ర బృందం సంప్రదించగా ... ఇతర మూవీ లతో బిజీ గా ఉండడం వల్ల ఈ ముద్దు గుమ్మ ఈ మూవీ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే విజయ్ ... లోకేష్ కాంబినేషన్ లో రూపొందిన మాస్టర్ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో లియో మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: