పేదవారికి ధనవంతులుగా మారాలని కోరిక ఉంటే ధనవంతులు మరింత ధనికులుగా మారాలని కలలు కంటూ ఉంటారు. దీనికి సంబంధించి ఎవరి స్థాయిలో వారు తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. వాస్తవానికి ఒక నిర్ణీత పద్ధతిలో ఆలోచించడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఖచ్చితంగా ధనవంతులు కాగలరు అని విశ్లేషకులు అభిప్రాయ పడుతూ ఉంటారు. 


ప్రతి వ్యక్తికి వారివారి స్థాయిలలో జీవితంలో ఎదగడానికి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే ఆ ఆలోచనలకు సృజనాత్మకత తోడయినప్పుడు మాత్రమే ఏవ్యక్తి అయినా ధనవంతుడు కాగలడు. పేదరికంలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి ధనం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీనిగురించి ఆ వ్యక్తికి ఎన్నో ఆలోచనలు కూడ వస్తూ ఉంటాయి. అయితే ఆ ఆలోచనలను క్రమ శిక్షణలో పెట్టినప్పుడు మాత్రమే ధనవంతులు కాగలరు. 


సంపదను ఆశించే ఆలోచనలు ప్రతివ్యక్తికి ఎలా వస్తూ ఉంటాయో సంపద పొందే హక్కు ప్రతి వ్యక్తికి భగవంతుడు కలిగిస్తాడని బైబిల్ చెపుతోంది. అయితే ఈ సంపద ఆలోచనల విషయంలో క్రమశిక్షణ లేకుండా అయోమయంలో పడుతూ అనేక పొరపాట్లు చేయడం వల్లనే ఒక వ్యక్తి తనకు సంపన్నుడు అయ్యే అవకాశం వచ్చినా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు అంటూ మనీ ఎక్స్ పర్ట్ జోసఫ్ మర్ఫీ అభిప్రాయపడుతున్నాడు. 


ఒక విత్తనాన్ని భూమిలోకి జారవిడిస్తే కొన్ని వందల విత్తనాలకు పుట్టుకను కల్గిస్తుంది ఇది భగవంతుడి సృష్టి. అందువల్లనే ఒకవ్యక్తి ఆలోచనలకు ప్రకృతి కూడ సహకరించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆలోచనలు విజయవంతం అయి ధనవంతుడుగా మారగలుగుతాడు. దీనికోసం ప్రతి మనిషి తన ఆలోచనా దృక్పథం మార్చుకోగలిగితే అదే సంపదను తెచ్చి పెడుతుంది. ఒక వ్యక్తి తనకోసం డబ్బు సంపాదన గురించి ఆలోచనలు చేయడం సర్వసాధారణ విషయమే అయినా ఎదుటి వారి గురించి ఆలోచన చేయగలిగినప్పుడే ఆ ఆలోచన అతడిని మరింత ధనవంతుడుని చేస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: