మనలో చాలామందికి ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఆస్థులకీ బరువుగా పరిగణింపబడే అప్పులకీ తేడా తెలియదు. చాలామంది అప్పులు చేసి ఆస్తులను కొంటూ ఉంటారు ఇలా ప్రవర్తిచడం వెనుక ఒక కారణం ఉంది. భవిష్యత్ లో ప్రతి ఆస్థి విలువ పెరుగుతుంది అన్న అంచనాతో చాలా మంది తప్పటడుగు  వేస్తూ ఉంటారు.  మన జేబులోకి వెంటనే డబ్బును తీసుకురాగల ఆస్థి మాత్రమే నిజమైన ఆస్థిగా పరిగణించాలి.


మనకు ఎలాంటి ఆదాయం ఇవ్వకపోవడమే కాకుండా ఒక ఆస్థి కొన్న తరువాత తరచుగా మన దగ్గర డబ్బును ఖర్చు పెట్టించే వస్తువలను ఆస్థులుగా కాకుండా అప్పులుగా పరిగణించాలి అని మనీ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. ఉదాహరణకు మనం అప్పు చేసి ఒక కారును కొన్నప్పుడు ఆ కారు షో రూమ్ నుండి మన ఇంటికి చేరగానే  దాని విలువ పడిపోవడం ప్రారంభం అయి 10 సంవత్సరాల కాలం గడిచే సరికి ఆ కారు విలువ 90 శాతం విలువ కోల్పోతుంది.


అదే ఒక వ్యక్తి ఆ డబ్బుతో బంగారం కొంటే 10 ఏళ్ళలో  దాని విలువ పెరగడమే కాకుండా ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడే వెంటనే బంగారాన్ని నగదుగా మార్చు కోవచ్చు. అదేవిధంగా కొందరు బ్యాంకులలో అప్పులు చేసి అద్దెలకు ఇవ్వడానికి ఇల్లు కొంటు ఉంటారు. అయితే తీసుకున్న అప్పుకి ఇంటి పై అద్దెగా వచ్చే మొత్తాలకు సంబంధం లేకుండా అనుకోని ఆర్ధిక సమస్యల మధ్య ఇరుక్కుంటూ ఉంటారు.


దీనితో మనకు ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఆస్థులను మాత్రమే ఆస్థులుగా పరిగణించాలి కాని మనకు విలాసాలను కలిగించే వస్తువులను ఆస్థులుగా పరిగనించ కూడదు చాలమంది వారి ఇంటిలో ఉండే విలాస వస్తువులను  ఆస్తులుగా భావిస్తారు. వాస్తవానికి  అవి అస్తులు కావు అన్నసత్యం గ్రహించి అప్పుకు ఆస్థికి మధ్య తేడాను గ్రహించ కలిగినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి  ధనవంతుడుగా మారగలుగుతాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: