ఈ మధ్యకాలంలో నాటు కోళ్ల పెంపకం లేకపోతే ఫారం కోళ్ల పెంపకం సంబంధించి ఎక్కువగా పలు ప్రాంతాలలో చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వాటిని మెయింటైన్ చేయడానికి కేవలం ఇద్దరు ముగ్గురు మనుషులు అయితే సరిపోతుంది. ముఖ్యంగా ec కోళ్ల పెంపకం వల్ల కూడా భారీ లాభాలు వస్తాయని కొంతమంది కోళ్లఫారాన్ని మెయింటైన్ చేసే వ్యక్తుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన శేషాద్రి నాయుడు అనే వ్యక్తి ec కోళ్ల ఫారాన్ని మెయింటైన్ చేస్తూ భారీ లాభాలను పొందుతున్నట్లు తెలుస్తోంది.


ఈ కంపెనీకి సంబంధించిన కోడి పిల్లలను మెయింటైన్ చేస్తే చాలు ఏడాదికి 35 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని తెలుపుతున్నారు. కేవలం మెడిసిన్ దానాలు పంపిణీ చేస్తారు.. కోడి పిల్లలను మనం సరిగ్గా పెంచుకుంటే చాలు కమిషన్ ద్వారా ఇన్ని లక్షల రూపాయలు మిగులుతుందని తెలుపుతున్నారు. ఒక్కో కోడికి 25 రూపాయల వరకు మిగులుతుందని కేజీ ప్రకారం ఇస్తారని తెలుపుతున్నారు. ఈ కోళ్ల పెంపకం ద్వారా ఏడాదికి రైతులకు 35 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని కంపెనీ వారు తెలియజేస్తున్నారు.



అయితే కోళ్లు మెయింటైన్ చేయడానికి షెడ్డు వేసిన తర్వాత కోడి పిల్లలను దాన మెడిసిన్ ని సైతం పంపిణీ చేస్తుందని ఆ తర్వాత కంపెనీ వాళ్లే కోళ్లను మార్కెట్లోకి విక్రయించి ఆ డబ్బు వచ్చిన తర్వాత కేజీకి 12 లేదా 14 రూపాయల చొప్పున ఇస్తారని తెలుపుతున్నారు. సాధారణ కోళ్లతో పోలిస్తే ఇవి కాస్త భిన్నంగా ఉంటాయని ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని కోళ్లను పెంచాలని కాబట్టి వీటిని ఈసీ కోళ్ల ఫారాలని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇందులో సెమీ ఆటోమేటిక్ ,పుల్లి ఆటోమేటిక్ అనే రకాలు కూడా ఉంటాయట.


EC కోళ్ల ఫారం లో ఉష్ణోగ్రతలను సైతం నియంత్రణలో ఉంచే విధంగా పలు చర్యలు తీసుకోవాలి. కావలసినంత ఉష్ణోగ్రతను అందించడం వల్ల.. నెలరోజుల లోపే అమ్మకానికి వస్తాయట.. అయితే బయట కోళ్లు మాత్రం రెండు నెలల సమయం పడుతుందని ఈసీ కోళ్లు ఫారం షెడ్డు పెట్టుబడి కాస్త ఎక్కువే అవుతుందని రెండు మూడు ఏళ్లలో ఆ డబ్బు మొత్తం తిరిగి వచ్చేస్తుందని పౌల్ట్రీ రైతుల సైతం తెలియజేస్తున్నారు. వీటిని పెట్టడానికి దాదాపుగా కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలుపుతున్నారు. మొత్తం మన తెలుగు రాష్ట్రాలలో 500 కు పైగా ఇలాంటి కోళ్ల ఫారాలు ఉన్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి: