‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఘన విజయం తరువాత నాని నిన్న ప్రారంభించిన ఒక సినిమాకు ప్రారంభం రోజునే అనుకోని షాక్ తగలడం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నానీకి ‘అష్టా చెమ్మ’ సినిమాతో కెరియర్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ నిన్న హైదరాబాద్ లోని సాంఘీ టెంపుల్ లో ప్రారంభం అయింది. నిన్న ఉదయం ప్రారంభం అయిన ఈసినిమా షూటింగ్ ముహూర్తపు క్లాప్ కొట్టిన వెంటనే అనుకోని దురదృష్టకర సంఘటన జరగడం అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక వివరాలలోకి వెళితే ఈసినిమా క్లాప్ సీన్ చిత్రీకరించిన వెంటనే ఈసినిమా యూనిట్ కు పనిచేస్తున్న తిరుపతి రావు అనే లైట్ అసిస్టెంట్ ఈసినిమా ఎలట్రికల్ ఎక్విప్ మెంట్ సర్దుతూ ఉండగా అతడికి ఎలట్రిక్ షాక్ తగిలి అక్కడకక్కడే చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అనుకోని సంఘటనకు షాక్ అయిన ఈ యూనిట్ సభ్యులు తిరుపతి రావును హాస్పటల్ కు తరలించినా ఎటువంటి ఫలితం లేకపోయింది అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈవిషయానికి సంబంధించి విచారణ జరుగుతోంది అని ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు ఈ విషయమై ఈ పత్రిక ఈ సినిమా దర్శక నిర్మాతలను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా వారు స్పందించలేదు అనే విషయాన్ని కూడ ఆ పత్రిక బయట పెట్టింది. 

నాని వరస పరాజయాల తరువాత హిట్ కొట్టిన ఆనందంతో మొదలు పెట్టిన సినిమా మొదటిరోజునే ఈ అనుకోని సంఘటన జరగడం యూనిట్ వారందరికీ షాక్ ఇచ్చినట్లు టాక్. అయితే ఈ సంఘటన తరువాత ఈసినిమా షూటింగ్ ను కొనసాగించారా ? లేదా అనే విషయం పై క్లారిటీ లేకపోవడమే కాకుండా ప్రమాదం జరిగినప్పుడు నాని షూటింగ్ స్పాట్ లో ఉన్నాడా ? లేడా అనే విషయం పై క్లారిటీ లేదు అంటూ ఆ ఆంగ్ల దిన పత్రిక కథనం..



మరింత సమాచారం తెలుసుకోండి: