నిన్న జరిగిన ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో ఫంక్షన్ లో విడుదల చేయబడ్డ ట్రైలర్ జూనియర్ అభిమానులకే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడ బాగా నచ్చింది అన్న సంకేతాలు వస్తూ ఉండటంతో జూనియర్ తన మొదటి పరీస్క్ష పాస్ అయ్యాడు అనుకోవాలి. ‘ఆకలి సెక్స్ నిద్ర ఈ మూడు మనుషులకు జంతువులకు కామన్ కాని మనుషులను జంతువులతో వేరు చేసేది ఎమోషన్’ అనే డైలాగ్ చాలా డిఫరెంట్ గా జూనియర్ ఈ ట్రైలర్ లో చెప్పడంతో ఇది చాలా డిఫరెంట్ మూవీ అనే సంకేతాలు ఇచ్చాడు జూనియర్. 

నిన్నవిడుదల అయిన ‘నాన్నకు ప్రేమతో’  ట్రైలర్ లో ప్రతీ ఫ్రేమ్ లోనూ ఎన్టీఆర్ న్యూ లుక్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపించాడు. అంతేకాదు గెడ్డం హెయిర్ స్టైల్ రెండూ ట్రెండ్ సెట్టింగ్ గా మారనున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ట్రైలర్ లో కనిపించే ప్రతీ ఫ్రేమ్ లోను ఈ సినిమా గురించి సుకుమార్ తీసుకున్న జాగ్రత్తలు మరియు తపన  కనిపిస్తుంది. అంతేకాదు ఈసినిమా కదా ఇద్దరు బిజినెస్ మెన్ ల మధ్య మైండ్ గేమ్ అనే విషయం ఈ ట్రైలర్ చూసిన వారికి అర్ధం అవుతుంది. 

ఇక స్టైలిష్ విలన్ గా కృష్ణమూర్తి పాత్రలో జగపతిబాబు చాలా అందంగా కనిపించాడు.  ఈ ట్రైలర్ లోని డైలాగులకు  ఎన్టీఆర్ తన వాయిస్ తో ప్రాణంపోసాడు.  దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మరోసారి మెస్మరైజ్ చేసేశాడు అన్న వార్తలు వస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో’ థీమ్ అదిరి పోయేలా ఉంది. ఇప్పటివరకు జూనియర్  తన సినిమాల్లో మాస్ యాంగిల్స్‌లో కనిపిస్తే ఈసారి కంప్లీట్‌ గా క్లాస్‌గా కనిపించాడు. 

కేవలం నిమిషమున్నర నిడివితో ఉన్న ఈ  ట్రైలర్ ఈ సినిమా అంచనాలను మరింత పెంచు తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.   సాధారణంగా జూనియర్ అరుపులు కేకలతో హడావిగా కనిపించే సినిమా ట్రైలర్  ఈ సారి డిఫరెంట్ గా కనిపించడంతో జూనియర్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ ట్రైలర్ ను చూసిన విశ్లేషకులు జూనియర్ సంక్రాంతి రేస్ లో జూనియర్ హిట్ కొట్టడం ఖాయం అన్న సంకేతాలు ఇచ్చేస్తున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: