ఒకనాటి టాప్ హీరో నేటి టాప్ విలన్ జగపతి బాబు వ్యక్తి గత జీవితం పై రకరకాల మాటలు గాసిప్పులుగా హడావిడి చేస్తూ ఉంటాయి. జగపతి  బాబు టాప్ హీరోగా వెలుగొందుతున్న రోజులలో క్యాజినోలకు వెళ్లి పందేలు కాసి కోట్లకు కోట్లు నష్టపోయాడని డబ్బంటే అస్సలు లెక్క ఉండదని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడనే వార్తలు వినిపించాయి. అందువల్లనే కోట్లు పోగొట్టుకున్నాడు అంటూ పుకార్లు అనేక సార్లు షికార్లు చేసాయి.  

అయితే  ఈ విషయాలను జగపతి బాబు చాలా లైట్ గా తీసుకోవడమే కాకుండా ఎప్పుడూ ఈ వార్తలను జగపతి బాబు ఖండించలేదు. అయితే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ జగపతి బాబు గురించి ఒక ఆసక్తికర విషయాన్ని లీక్ చేసాడు. సుకుమార్ సహాయ దర్శకుడిగా పని చేస్తున్న రోజులలో  జగపతిబాబుతో ‘హనుమాన్ జంక్షన్’ సినిమాకు పని చేసాడట. ఆ అనుభవాలు గుర్తుకు వచ్చి జగపతి బాబు గురించి భయపడ్డాను అని అంటున్నాడు.

గతంలో జగపతి బాబు సెట్లో ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్లందరూ  ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేవారట. దీనికి కారణం వాళ్లందరికీ  జగపతి  డబ్బులిచ్చి ఎంజాయ్  చేయమని చెప్పవాడట. ‘హనుమాన్ జంక్షన్’  సినిమా తీస్తున్న రోజుల్లో తనకు కూడా అలాగే జగపతి బాబు డబ్బులిచ్చిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు సుకుమార్. ఈగతం గుర్తుకు వచ్చి ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ టైంలో చాలా భయపడ్డాను అంటూ జోక్ చేసి అయితే ప్రస్తుతం జగపతి బాబు మారిపోయాడు అంటూ సెటైర్ వేసాడు సుకుమార్. 

ఈ వార్తలు ఇలా ఉండగా జగపతి బాబు మాట్లాడుతూ నేడు ‘నాన్నకు ప్రేమతో’ రేపు ‘అల్లుడుకి ప్రేమతో’ అన్న మాటలను బట్టి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో జూనియర్ కు మామగా జగపతి బాబు నటిస్తున్నడా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: