దక్షిణాది సినిమా రంగంలోనే కాకుండా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ స్టేటస్ ఉన్న శ్రుతిహాసన్ బతిమాలుతు పెట్టిన ట్విట్ షాకింగ్ గా మారింది. ప్రస్తుత పరిస్థుతులలో ఒక స్త్రీ స్వేచ్చగా రాత్రి తొమ్మిది తరువాత తిరగలేని పరిస్థుతుల వల్ల తాను కూడ ఒక సెలెబ్రెటీ స్టేటస్ లో ఉన్నా తన షూటింగ్ పూర్తి అయిన తరువాత తనకు నచ్చిన ప్లేస్ కు వెళ్ళి తాను కోరుకున్న విధంగా ఎంజాయ్ చేయలేక పోతున్నానని తన బాధను వ్యక్త పరిచింది శ్రుతి హాసన్.

తమ కుటుంబానికి చెందిన ఆడవాళ్ళు సేఫ్ గా ఉండాలని భావించే మగవాళ్ళు బయట కుటుంబాలకు చెందిన స్త్రీల పై ఎందుకు అత్యాచారాలు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదు అని అంటూ ‘ఆడవాళ్ళు అందరూ తమ కొడుకులను సరిగ్గా పెంచాలని కోరుకుంటున్నా బతిమాలుకుంటున్నా’ అంటూ షాకింగ్ ట్విట్ చేసింది శ్రుతి. ఏ వ్యక్తి స్వభావమైనా అతడి తల్లి తండ్రుల పెంపకం పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందుగా తల్లి తండ్రులు మారాలి అంటోంది శ్రుతి.

‘సేఫ్టీగా స్వేచ్చగా జీవించడం నా హక్కు, నేను ఎవరి కూతురుని అన్నది ముఖ్యం కాదు’ అని అంటూ శ్రుతి అమ్మాయిల తరపున తన బాధను వ్యక్త పరుస్తూ అర్దరాత్రి క్షేమంగా స్త్రీ తిరిగిన నాడు నిజమైన స్వాతంత్ర్యo అన్న మహాత్మాగాంధీ మాటలను గుర్తుకు చేస్తూ పట్టపగలు కూడ స్వేచ్చగా తిరగలేక పోతున్న నేటి మహిళల పరిస్థితిని ప్రతిబింభిస్తూ శ్రుతి తన భావాలను తన ట్విటర్ లో పంచుకుంది.

టాప్ హీరోయిన్ స్టేటస్ లో ఉండి కూడ శ్రుతి లాంటి వ్యక్తులకు ఇలాంటి అబద్రతా భావం ఏర్పడింది అంటే మన దేశంలో సామాన్య మహిళల పరిస్థితి ఏమిటో అర్ధం అవుతుంది. అయితే శ్రుతి ఎంత విన్నవించుకున్నా మగ పిల్లల పెంపంకం విషయంలో తల్లిదండ్రులు ఎంత వరకు శ్రుతి మాటలను అనుసరిస్తారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: