ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న యువ దర్శకుల్లో సందీప్ కిషన్ ఒకడు. ప్రస్థానం సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన సందీప్ స్నేహగీతంతో లైం లైట్లోకి వచ్చాడు. ఇక రొటీన్ లవ్ స్టోరీ అంటూ హీరోగా ప్రయత్నించి సోలోగా సక్సెస్ అయిన సందీప్ ఆ వెంటనే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అంటూ హిట్ కొట్టి తన సత్తా చాటాడు. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ సినిమా సినిమాకు తనలో ఉన్న టాలెంట్ ను బయట పెడుతున్న సందీప్ టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్లో కూడా వరుసెంట సినిమాలు చేస్తున్నాడు.


సినిమా హీరోగా చేయడానికి ముందు అసిస్టెంట్ డైరక్టర్ గా కెరియర్ ప్రారంభించిన సందీప్ తెలుగు క్రేజీ సినిమాటోగ్రాఫర్స్ చోట, శ్యామ్ కె నాయుడుల మేనళ్లుడు కావడం విశేషం. మేనమామల అండదండలు ఉన్నా సొంత టాలెంట్ తో సినిమాలు చేస్తున్న సందీప్ కెరియర్ లో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.  


సందీప్ మొదట నటించిన సినిమా ప్రస్థానం.. దేవాకట్టా డైరెక్ట్ చేసిన ప్రస్థానంలో శర్వానంద్ హీరోగా నటించాడు. ఇక ఆ తర్వాత స్నేహగీతం సినిమాలో కూడా నలుగురు స్నేహితులలో ఒకరిగా నటించిన సందీప్ అందులో కూడా సినిమా ప్రయత్నాలు చేసే కుర్రాడిగా కనిపించాడు. 


రొటెన్ స్టోరీ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, గుండెల్లో గోదారి, డి.కె బోస్ సినిమాల్లో నటించిన సందీప్ ఆ తర్వాత చేసిన డి ఫర్ దోపిడి, రారా కృష్ణయ్య, జోరు, బీరువా సినిమాలు ఫ్లాప్ బాట పట్టాయి. ఇక టైగర్ అంటూ సరికొత్త ప్రయత్నంగా తన టాలెంట్ చూపించిన సందీప్ ఆ సినిమాతో హిట్ అందుకున్నాడు. అంతేకాదు టైగర్ సినిమాలో సందీప్ నటనకు మాస్ మహరాజ్ రవితేజ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా సందీప్ ను ప్రశంసించడం జరిగింది. 


రీసెంట్ గా రన్ అంటూ ప్రేక్షకులను పలుకరించిన సందీప్.. ప్రస్తుతం ఒక అమ్మాయి తప్ప సినిమాలో నటిస్తున్నాడు.. ఆ తర్వాత కృష్ణవంశీ డైరక్షన్లో నక్షత్రం సినిమా చేస్తున్నాడు. వెండితెర మీద తన దర్శకత్వ ప్రతిభతో ఎన్నో అద్భుతాలను సృష్టించిన కృష్ణవంశీ సందీప్ కిషన్ కు సూపర్ హిట్ ఇస్తాడనడంలో సందేహం లేదు. నందిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.  
మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందీప్ కిష్ కు ఈ సంవత్సరం చేస్తున్న సినిమాలన్ని సూపర్ సక్సెస్ అందాలని కోరుకుంటూ మరోసారి సందీప్ కిషన్ కు హ్యాపీ బర్త్ డే తెలియచేద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: