నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ నిమిత్తం మొరాకో లో చాల బిజీగా ఉంటే బాలయ్య అభిమానులు మాత్రం ఒక విషయమై తీవ్రంగా కలవర పడుతున్నట్లు వార్త్తలు వస్తున్నాయి. ఇలా బాలయ్య అభిమానుల టెన్షన్ ఒక కారణం ఉంది అని అంటున్నారు. గడిచిన సంక్రాంతికి జరిగిన నందమూరి వార్ లో బాలకృష్ణ ‘డిక్టేటర్’ పై ‘జూనియర్ నాన్నకు ప్రేమతో’ పై చేయి సాధించిన విషయం మరిచిపోవక ముందే మరో షాక్ జూనియర్ బాలయ్యకు ఇవ్వబోతు ఉండటం బాలకృష్ణ అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు అని టాక్. 

ఆ సక్తికరమైన ఈన్యుస్ వివరాలలోకి వెళితే జూనియర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ ఈనెల 20న జూనియర్ పుట్టినరోజు నాడు విడుదల అవుతూ ఉంటే నందమూరి తారకరామారావు పుట్టినరోజు అయిన మే 28న ‘జనతా  గ్యారేజ్’ టీజర్ విడుదల కాబోతోంది. ఇలా ఈనెల అంతా జూనియర్ హంగామాతో మేనెల కనిపించబోతోంది. 

అయితే  నందమూరి సింహం బాలకృష్ణ హడావిడి ఏది ఈనెల కనిపించక పోవడం బాలయ్య అభిమానులకు తీవ్ర అసంతృప్తిని మిగులుస్తున్నట్లు టాక్. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ మొరాకోలో ఉన్న నేపధ్యంలో ఈనెల 28న జరగబోతున్న ఎన్టీఆర్ జయంతి వేడుకలలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ వేడుకలలో ఎక్కడా బాలయ్య సందడి కనిపించ కుండా కేవలం జూనియర్ ‘జనతా గ్యారేజ్’ హడావిడి మాత్రమే కనిపించడం బాలయ్య అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు అని టాక్. 

దీనితో  నందమూరి తాటక రామరావు పుట్టిన రోజునాడు కనీసం ‘గౌతమీ శాతకర్ణి’ షూటింగ్ వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసి తమకు జోష్ కలిగిస్తే బాగుంటుందని బాలకృష్ణ అభిమానులు కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి బాలయ్య నందమూరి అభిమానుల కోరిక తెలుసుకుని ఆ విధంగా స్పందిస్తాడో లేదో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: