చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ చేస్తున్న ప్రయత్నాలపై బాలీవుడ్ లో సెటైర్లు పడుతున్నట్లు టాక్. ఆశక్తి కలిగించే ఈన్యూస్ వివరాలోకి వెళ్ళితే చిరంజీవి 150వ మూవీ ‘కత్తిలాంటోడు’ కు హీరోయిన్ సమస్య ఏర్పడటంతో చరణ్ దృష్టి ఇప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్ పై పడింది అని టాక్.  

చిరంజీవి సరసన నటించే హీరోయిన్లు ఎవరా అన్న సస్పెన్స్ కొనసాగుతుండగానే  చరణ్ ఒక అనుకోని  ట్విస్ట్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట్లో  ఈసినిమా కోసం అనుష్క నయనతారల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పటికీ  ఏదీ వర్కౌట్  కాని నేపధ్యంలో చరణ్ ఈసినిమాలో హీరోయిన్ గా నటించడానికి బోలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపికను సంప్రదిస్తున్నట్లు టాక్. 

ఇలా చరణ్ ఆలోచనలు మారడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. ఈ మూవీ తమిళ వెర్షన్ లో విజయ్ సరసన మొదట బాలీవుడ్ బ్యూటీ  ఐష్  అనుకున్నారట. అయితే బడ్జెట్ పరంగా ఎక్కువ అవుతుంది అన్న నేపధ్యంలో ఆ ఆలోచనలు అప్పట్లో విరమించుకున్నారు. ఆ విషయం ఇప్పడు చరణ్ కి గుర్తుకు వచ్చినట్లు తెలుస్తోంది. 

దీనితో దీపికా పదుకునే ను ‘కత్తిలాంటోడు’  మూవీకోసం గట్టిగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఓ హాలీవుడ్ చిత్రం కోసం పని చేస్తోంది. అది పూర్తి కాగానే ఆమెను ‘కత్తిలాంటోడు’ లో చేయడానికి చరణ్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసాడు అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీపిక గతంలో రజినీకాంత్ తో తీసిన ‘కొచ్చాడియన్’ సూపర్ ఫ్లాప్ గా మారిన నేపధ్యంతో పాటు దీపిక భారీ పారితోషికాన్ని ‘కత్తిలాంటోడు’ తట్టుకోగలడా ? అంటూ సెటైర్లు పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: