నిత్యామీనన్.. హీరోయిన్లలో ఈ అమ్మడి రూటే సెపరేటు.. రొటీన్ గా హీరోయిన్ అంటే డబ్బు కోసం గ్లామర్ ఆరబోయడం.. ఎక్స్ పోజింగ్ ద్వారా పేరు తెచ్చుకోవడం.. అవకాశాల కోసం కాకాపట్టడం.. ఇలాంటి వాటికి ఈ అమ్మడు చాలా దూరమన్న సంగతి తెలిసిందే. 

ఈ ఆటిడ్యూడ్ వల్లే కాస్త పొగరన్న పేరు కూడా తెచ్చుకుంది. ఈ అమ్మడిపై సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ కూడా తక్కువే. మరి అలాంటమ్మడు లవ్ లో పడిందా.. ఎవరితో అని ఆలోచిస్తున్నారా.. నిత్యామీనన్ ఒకరిని ప్రేమించిన సంగతి వాస్తవమే.. ఆ విషయం ఆమే స్వయంగా చెప్పింది. 


కానీ ఆ ప్రేమ ఇప్పటిది కాదట. టీనేజ్ లో సంగతంట.. తెలిసీతెలియని టీనేజ్‌లో ఒకబ్బాయిని ఇష్టపడిందట. కానీ ఎందుకనో అతని ప్రవర్తన ఆమెకు అంతగా నచ్చలేదట.  కొన్నాళ్ల తరవాత అతనితో కలిసి జీవితాంతం ఉండలేననిపించిందట నిత్యాకు. అంతే ఆ లవ్ అప్పటితో క్లోజ్ అయ్యిందట. 

మరి టీనేజ్ లోనే లవ్ పడిన అమ్మాయి.. మరి గ్లామర్ ఫీల్డులో ఉంది కదా ఇప్పుడు లవ్వూ గివ్పూలేవా అంటే.. ఇప్పుడు వాటి గురించి ఆలోచించే టైమే లేదంటోంది. అంతేకాదు.. కనీసం ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి ఖాతాలను మెయింటైన్ చేసే ఆలోచన కూడా లేదట. కాలేజీ రోజుల్లోనే ఆమె తన ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ క్లోజ్ చేసిందట. అదీ సంగతి.



మరింత సమాచారం తెలుసుకోండి: