మీరు మీ  ఆఫీసు లో  ఎడతెగని  పనివత్తిడి  తో  సతమవుతున్నారా?  ఒక  శాత్రవేత్త  ఏదైనా  పరిశోదన లో  ఒక  విషస్-సర్కిల్లో  చిక్కుకొని  తెగని సమస్య తో  కొట్టుమిట్టాడుతున్నారా?  ఒక క్రీడాకారుడు ఫాం లోకి రాలేక పోతున్నారా?  ఒక విద్యార్ధి పోటీపరీక్ష లకు ప్రిపేరౌతూ  స్ట్రెస్ కు గురౌతున్నారా?   వీటన్నిటికిపరిష్కారంకావాలా?  ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందిఎందుకంటే సమస్య పరిష్కారం  కవలపిల్లలు(ట్విన్స్కాని విడిపొయిన కవలలు.  వీరిని ఒక్కచోటికి చేరిస్తే  ముసురుకున్న మబ్బులు  విడిపోతాయి.



ఈకలపటానికిఒకచక్కనితరుణోపాయాన్నికనిపెట్టటానికిఆలోచనకావాలి.ఆలోచనమనసుఫ్రీగాఉంటేనేవస్తుంది.ఫ్రీగాఉండాలంటేకాసేపుచిన్నఎంటర్టైన్మెంట్గాని,ప్రకృతిలోపులకరించటంగాని,వానజల్లులోపరవసించటంగానిఇలాప్రతొక్కరికీఒక్కోదాంట్లోపరవశందొరుకుతుంది.



అన్నిటికీ,అందరికిఒకప్పుడుసమాదానంగానిలిచించిందిమహానటిసావిత్రి,తానునటించినప్రతిసినిమా.బహుశఆమెసినిమాలుచూసినఆతరంవాళ్ళుఅమెపేరుతల్చుకుంటేనేపుకరించిపోతారు.ఆతలపు,పులకరింతఈకాలంనటీమణుల్లోకానరాదు.కాబట్టిఈతరంయువతకుసలహాఏమంటేసావిత్రినటించినఒకవినొదాత్మకసినిమాచూడండి.మీలోప్రెసిపిటేట్అయిననిర్లిప్తతమటుమాయంఅవుతుంది.ఉదాహరణకుసావిత్రినటించినమాయాబజార్,గుండమ్మకథ,ఉమ్మడికుటుంబం లిష్ట్చాంతాడంత. వినోదంకొండంత.



నట సార్వభౌమ యశశ్వి ఎస్.వి. రంగారావు తోనే పోటీపడి నటించి ఆయనకు నటించటము లో చూక్కలు చూపించిన తమిళ నడిగర తిలకం, తెలుగు నటశిరోమణి సావిత్రి. నందమూరి, అక్కినేని, శివాజి, జెమిని గణేషన్లు ఆమెకు సమ ఉజ్జీలే కాని అధికులు కారు. వేరెవరూ నటనలో ఆమె సమీపం లోకి చేరలేరు. అంతటి నట తేజస్విని ఆమె. దక్షిణాదినే కాదు యావద్భారతఅవనిలోనే దిగ్-దిగ్గజ అభినేత్రి. దిగంతాలను నటనలో, అందంతో సమ్మోహితం చేసిన మోహనాంగి.  తమిళం లో కలైమామణి బిరుదుతో పాటు, "చివరకు మిగిలేది" సినిమాకు ప్రజల హృదయాల్లో స్థానం తో పాటు భారత రాష్ట్రపతి అవార్డ్ వచ్చిందిఫిల్మ్-ఫేర్ అవార్డులకు లెక్కేలేదు.



తనికెళ్ళ భరణి ఆమె గురించి రాసిన ఒక గేయం చదువరుల మదిలో తీయని గాయం చేస్తుంది.

త్రివిక్రమ స్వరూపం
నటరాజుకి స్త్రీరూపం
సావిత్రి……
సావిత్రి కొంగు
నిర్మాతలకు బంగారం.


ఆవిడ కన్యాశుల్కంలో నవ్వితే
మధురవాణే డంగై పోయింది!
మాయాబజార్ లో
ఘటోత్కచుణ్ణి అనుకరిస్తే
రంగారావే కంగారు పడ్డాడు!!
ఆమె నాయికైతే
ప్రేక్షకుడే నాయకుడు
ఆమె చెల్లి అయితే
ప్రేక్షకుడే అన్న
ఆమె పార్వతైతే
ప్రేక్షకులంతా దేవదాసులే


కోమాలో ఆమెను చూస్తే
పాడుబడ్డ బావిలో
తేలే చందమామలాగా….
పతనమైన విజయనగర
సామ్రాజ్య వైభవంలాగా
శిధిలమైన వేయి స్తంభాల
గుడిలాగా….


ఓడరేవులో లైట్లారిపోయిన
ఒంటరి దీపస్తంభంలాగా
ఉండేది!!!
న భూతో న భవిష్యతి


ఒక్క సావిత్రికే ఈ వాక్యం వాడొచ్చు.



దక్షిణ భరతదేశం సినీ స్వర్ణయుగానికి తన వంతు సహకారం అందించిందనేకంటే అసలు సావిత్రే లేకుంటే దానిని స్వర్ణయుగం అనక్కరలేదు అంటారు సిని పాత్రికేయులు.

అంతేకాదు ఆమె నటన గురించే కాదు ఆమె జీవితం మీదే పుస్తకాలనేకం ప్రచురితమయ్యాయి. అందులో ప్రముఖమైనది పసుపులేటి రామారావు గారి విరచిత " వెండితెర వెలుగులు" విశ్వవిఖ్యాతి ఘడించింది.



దక్షిణ భరతదేశం సినీ స్వర్ణయుగానికి తన వంతు సహకారం అందించిందనేకంటే అసలు సావిత్రే లేకుంటే దానిని స్వర్ణయుగం అనక్కరలేదు అంటారు సిని పాత్రికేయులు.

అంతేకాదు ఆమె నటన గురించే కాదు ఆమె జీవితం మీదే పుస్తకాలనేకం ప్రచురితమయ్యాయి. అందులో ప్రముఖమైనది పసుపులేటి రామారావు గారి విరచిత " వెండితెర వెలుగులు" విశ్వవిఖ్యాతి ఘడించింది.



జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ ఈమె చందన సుగంధాన్ని విరజల్లే చందన శిల్పమని, దేదీప్యమానం గా చీకటిని తరిమివేసే  కర్పూర దీపమని అరవయ్యో దశాబ్ధానికి, డెబ్బైవ దశాబ్ధానికి ఈ నటకళాభినేత్రి అధినేత్రి అనని ప్రకటించారు. అంతేకాదు ఆయన జ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన రచన "పాకుడు రాళ్ళు" చదివితే నేపద్యములో సావిత్రే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: