యంగ్ హీరో నితిన్, క్యూట్ గర్ల్ నిత్యామీనన్ ప్రేమలో పడ్డాడా? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని చెప్పడానికి ఒక న్యూస్ బయటకు వచ్చింది. 12 ఫ్లాప్ లు తరువాత తనతో నటించి తనకు మంచి హిట్ ‘ఇష్క్’ ద్వారా యిచ్చిన నిత్య అంటే నితిన్ కు విపరీతమైన అభిమానం అట. దీనికి తోడు వీరిద్దరూ జంటగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సూపర్ హిట్ గా నిలవడంతో వీరిద్దరి మధ్య అభిమానం మరింత పెరిగింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న యామీగౌతమ్ ను తీసివేసి ఆమె స్థానంలో నిత్యామీనన్ పెట్టమని నితిన్ దర్శకుడు గౌతమ్ మీనన్ పై ఒత్తిడి చేస్తునాడట.
ఇప్పటికే ఈ సినిమాకు సంబందిచి, యామీగౌతమ్ పై కొన్ని దృశ్యాలను చిత్రీకరించిన గౌతమ్ మీనన్ నితిన్ సలహాకు మండిపడ్డాట, అంతేకాదు మీద్దరిమధ్యా ఉన్న అభిమానాలు ఈ సినిమాకు అడ్డంగా తీసుకు రాకండి అంటూ నితిన్ కు క్లాస్ కూడా పీకాడట. దీనితో దిగాలు పడ్డ నితిన్ తనకు హ్యాట్రిక్ విజయం నిత్యామీనన్ లేకుండా తన సినిమాకు సూపర్ హిట్ రాదేమో అన్న దిగులుతో నిత్యామీనన్ గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ ను ఏవిధంగా ఒప్పించాలి అని ఆలోచనలో పడ్డాడట. ఇంతకీ నితిన్ ఇలా పట్టు పట్టడడం అతడి సెంటిమెంటా లేదా నిత్య పై ప్రేమా అన్నది సస్పెన్స్....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి