తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో మంచి కమెడీయన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు బాబు మోహన్. ఇండస్ట్రీలో ఒకప్పుడు బాబుమోహన్, కోటా శ్రీనివాసరావు కాంబినేషన్ అంటే థియేటర్లో పడీ పడీ నవ్వేవారు. తర్వాతి కాలంలో బాబు మోహన్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగు దేశం పార్టీ మంత్రిగా కొనసాగారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లోకి జంప్ కావడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం పై విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు తెలిపారు.
హాస్య నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి కూడా ఓ వెలుగు వెలిగాడు బాబు మోహన్ అలాంటిది ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం అనే కదా మీ డౌట్ ? కానీ ఇది నిజం. అయితే దానికి కారణం ఆయన కుమారుడు..అవును ఎంతో ప్రేమతో చూసుకునే తన కొడుకు పెళ్లైన తర్వాత చనిపోవడం ఆయన మనసును ఎంతగానో గాయపరిచిందట.
బాబు మోహన్ తనయుడు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు దాంతో తీవ్ర షాక్ కి గురై కొన్నాళ్ల పాటు బయటకు రాలేకపోయాడట. బాబు మోహన్ మాత్రమే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా కాలం వరకు ఆ షాక్ నుంచి తేరుకోలేక ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మానేశారట. ఒక దశలో నా కొడుకు లేని జీవితం ఎందుకు అని ఆత్మహత్య చేసుకువాలని అనుకున్నాడట కానీ మెల్లి మెల్లిగా ఆ లోకం నుండి బయటకు రావడంతో ఆత్మహత్య ఆలోచన విరమించు కున్నాడట .