తెలుగు బుల్లితెరపై తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన ‘జబర్ధస్త్’ కామెడీ షో పై గత కొన్ని రోజులుగా ఎన్నో వివాదాలు వస్తున్నాయి.  ఇక జబర్ధస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కొట్టేస్తున్నారు. ఇక ఇందులో వస్తున్న యాంకర్లు అనసూయ, రష్మి ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
Image result for jabardast aadi kathi mahesh
ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్నారు. జబర్ధస్త్ కామెడీ షో కి వైసీపీ ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ మద్య ఈ కార్యక్రమంలో అసభ్యత శ్రుతి మించుతోంది. ఇదే సమయంలో అనాథలు, మహిళలు, వికలాంగులను కించపరిచేలా జోకులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై అనాథ పిల్లలు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.
Image result for jabardast aadi kathi mahesh
హైపర్ ఆది, రోజా, నాగబాబు, అనసూయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అనాథ యువతులు ఫిర్యాదు చేశారు. ఈ మద్య ప్రసారమైన ఓ స్కిట్ లో అనాధలపై వల్గర్ గా కామెంట్ చేశారని అంటున్నారు.  జాబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవావని కోరారు.
Image result for jabardasth show
ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని మహేష్ తెలిపాడు. తన మద్దతు అనాథలకే అని చెప్పాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: