మెగా ఫ్యామిలీ ప్రొడక్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ ను ప్రస్తుతం మెగాఫ్యామిలీ కార్నర్ చేస్తోందా అంటూ కొన్ని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనికికారణం తేజ్ లేటెస్ట్ గా నటిస్తున్న ‘ఇంటలిజెంట్’ మూవీ ప్రమోషన్ కు సంబంధించి జరిగిన ఏ ఈవెంట్ లోను మెగా ఫ్యామిలీ హీరోలు ఒక్కరు కూడ కనిపించలేదు. ఈమూవీ టీజర్ ను హీరో బాలకృష్ణ రిలీజ్ చేస్తే ఈమూవీ మొదటి పాటను హీరో ప్రభాస్ రిలీజ్ చేసాడు. 
DHARAM TEJ INTELLIGENT MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

అయితే ఈఇద్దరు టాప్ హీరోలు ఈ ఈవెంట్స్ కు రావడం వెనుక దర్శకుడు వినాయక్ పెట్టిన వ్యూహాత్మక బలవంతం అని అంటున్నారు. అయితే ఈ ‘ఇంటలిజెంట్’ సినిమాకు సంబంధించి జరిగిన ఈవెంట్స్ లో ఎక్కడా మెగా యంగ్ హీరోలు కనిపించక పోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 1980 నాటి చిరంజీవి హిట్ సాంగ్స్ ని రీమిక్స్ చేయించుకుని తన సినిమాల్లో పెట్టుకుంటూ చిరు వేసిన స్టెప్స్ నే తానూ వేసి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసే ప్రయత్నాలు సాయిధరమ్ తేజ్ చేస్తున్నా ఈ మెగా బ్రాండ్ ఇమేజ్ తేజ్ స్థాయికి సరిపోవడంలేదు అని అంటున్నారు. 
DHARAM TEJ INTELLIGENT MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

వినాయక్ డైరెక్షన్లో సిద్ధమైన తేజ్ భారీ మూవీ ‘ఇంటిలిజెంట్’ కు బడ్జెట్ 30 కోట్లవరకు అయిన నేపధ్యంలో ఈమూవీకి ఖర్చుపెట్టిన బడ్జెట్ తో పోలిస్తే ‘ఇంటిలిజెంట్’ మూవీకి  జరుతున్న బిజినెస్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు అని వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో తన మూవీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఫెయిల్ అవకూడదు అన్న కసితో తేజ్ ఎన్నో ఆలోచనలు చేస్తూ ఈమూవీని ప్రమోట్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగా నాగశౌర్య ‘ఛలో’ మూవీని ప్రమోట్ చేయడానికి సమయం కేటాయించిన చిరంజీవి మెగా మేనల్లుడ్ని ఎందుకు అనాథను చేసాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.  
DHARAM TEJ INTELLIGENT MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం

ఇది చాలదు అన్నట్లుగా తేజ్ ‘ఇంటిలిజెంట్’  మూవీతో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ మూవీ కూడ ఒకేరోజు విడుదల కావడం ‘ఇంటలిజెంట్’ సినిమా కలక్షన్స్ కు శాపంగా మారుతుంది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. ఇలాంటి చక్ర వ్యూహం మధ్య చిక్కుకున్న సాయి ధరమ్ తేజ్ మూవీ ఫెయిల్ అయితే కెరియర్ పరంగా ఈ మెగా మేనల్లుడుకి అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: