సినిమా లో ఒకటి రెండు ఫ్లాప్ లు వస్తే వారి గురించి దర్శక నిర్మాతలు పట్టించు కోవడం మానేస్తారు. అయితే ఎలాగైనా అవకాశాలు చేజిక్కుచ్చుకోవాలని హీరోయిన్స్ ఎక్కువగా అందాలను ఆరబోయడం స్టార్ట్  చేస్తారు. ఇప్పుడు ఎవరా ఆ భామలు అంటే 'యామీ గౌతమ్', 'పూజా హెగ్డే'. ఇద్దరూ అందగత్తెలే అయినప్పటికీ వారు నటించిన సినిమాలు తగిన స్థాయిలో ఆడటం లేదు.
Image result for puja hegde
కెరీర్ ప్రారంభంలోనే హిందీలో 'హృతిక్ రోషన్' ప్రక్కన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ భామలకు చేదు అనుభవమే మిగిలింది. అందులో యామీ గౌతమ్ 'కాబిల్' అనే చిత్రంలో, పూజా హెగ్డే 'మొహెంజోదారో' అనే చిత్రాల్లో హృతిక్ సరసన నటించినప్పటికీ  సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు.  తెలుగులోనూ అడపాదడపా నటించిన ఈ ముద్దుగుమ్మలకు ఇక్కడా చేదు అనుభవమే మిగిలింది. యామీ గౌతమ్ తెలుగులో 'కొరియర్‌ బాయ్ కళ్యాణ్' చిత్రంలో నితిన్  సరసన నటించింది.
Image result for yami gautam
పూజా హెగ్డే 'ముకుందా', 'ఒక లైలా కోసం' మరియు 'డీజే' సినిమాలలో కనిపించింది. పైగా 'డీజే' సినిమాలో బికినీ వేసి కుర్రకారుని ఊరించేసింది. ఆ సినిమాలో ఎక్స్‌పోజింగ్  శృతిమించిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఇన్ని చేసినా ఆ సినిమా విజయవంతం కాలేదు. ఆ దెబ్బకు పూజాకు సినిమాలు కరువై సినీ ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఇక యామీ గౌతమ్ అయితే ఏకంగా  మగాళ్ల మేగజిన్ మ్యాక్సిమ్ కవర్‌ పేజీపై అర్థ నగ్నంగా ఫోజులిచ్చింది. ఈ భామలను ఆదుకునే నిర్మాతలు, దర్శకులు ఎవరోగానీ, ఇప్పుడైతే మాత్రం పూర్తిగా సినీ అవకాశాల కోసం ఇలా ఫోజులివ్వడంతో బీటౌన్‌తో పాటుగా అభిమానులు సైతం విస్తుపోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: