ఈ సంవత్సరం టాప్ హీరోల సమ్మర్ రేస్ చివరికి చేరుకుంది. ఈ టాప్ హీరోల రేస్ లో చివరి సినిమాగా రాబోతున్న రవితేజ ‘నేలటిక్కెట్టు’ ఈ నెల 25న విడుదల కాబోతోంది. దీనితో ఈసమ్మర్ రేస్ కు మాస్ మహారాజ ఎటువంటి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాడు అన్న విషయమై అంచనాలు పెరుగుతున్నాయి.
NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈమూవీలో రవితేజ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈమూవీకి నిర్మాతలు ఖర్చు పెట్టిన ఖర్చు రవితేజ మూవీల మార్కెట్ కు మించి ఉండటంతో ఈసినిమాకు ఈమూవీ నిర్మాతలు కోరుకున్న రేట్లు బయ్యర్ల నుండి రావడం లేదు అని వార్తలు వస్తున్నాయి. 
సంబంధిత చిత్రం
దీనికితోడు రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘టచ్ చేసి చూడు’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో మాస్ మహారాజ మార్కెట్ పై నమ్మకం లేక చాలామంది బయ్యర్లు ‘నేలటిక్కెట్టు’ పై ఆసక్తి కనపరచడం లేదు అని అంటున్నారు. అయితే ఈమూవీ  ఆడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ అతిధిగా వచ్చిన తరువాత ఈమూవీ గురించి బయ్యర్లలో ఆసక్తి పెరుగుతుంది అని ఈమూవీ నిర్మాతలు భావించారు. 
NELA TICKET MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
పవన్ ఈమూవీ గురించి అదేవిధంగా రవితేజ గురించి ఎంతో గొప్పగా మాట్లాడినా ఈమూవీ ఆడియో ఫంక్షన్ ను బాగా ఖర్చు పెట్టి ఘనంగా చేసినా ఇప్పటికీ ‘నేలటిక్కెట్టు’ కు బయ్యర్ల నుండి సరైన ఆఫర్లు రావడం లేదు అని టాక్.  దీనితో ఈమూవీ నిర్మాతలు సొంతంగా విడుదల చేసుకోవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో రవితేజాకు క్రేజ్ తగ్గిపోయిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ ఇమేజ్ తాను నటించిన ‘అజ్ఞాతవాసి’ విజయానికే సరిపోని నేపద్యంలో రవితేజ ‘నేలటిక్కెట్టు’ కు ఏ విధంగా సరిపోతుంది అంటూ కొందరు పవన్ వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు.. 
.


మరింత సమాచారం తెలుసుకోండి: