ఆ మధ్య హైదరాబాద్ లో తన కారుకు దారి ఇవ్వలేదంటు కొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లతో తగువు పడ్డ హీరో రామ్ చరణ్ ఒక బైక్ వివాదంలో చిక్కుకున్నాడు. కోట్లు సంపాదించే హీరో ఒక మోటార్ సైకిల్ గురించి గొడవ ఏమిటి అని అనుకుంటున్నారా ఇది నిజం. వచ్చే నెల మొదటి వారంలో విడుదలకు సిద్దంగా ఉన్న చెర్రీ ‘జంజీర్’ సినిమాలో ‘ముంబైకా హీరో’ పాటలో ప్రియంక చోప్రాతో కలిసి స్టెప్స్ వేస్తూ ఒక మోటార్ బైక్ ను ఉపయోగించాడు. ఆ మోటార్ బైక్ ఒక ఇంపోర్టెడ్ మోడల్.

దాని యజమాని పేరు ముంబైలో ఉంటున్న ప్రిన్స్ ది అట, ఆ ప్రిన్స్ ఈ సినిమా దర్శకుడు అపూర్వ లఖియా  కు మంచి స్నేహితుడు కూడా ఫ్రెండ్లీ గా అపూర్వ లఖియా ప్రిన్స్ నుండి తీసుకున్న ఆ ఫాన్సీ మోటార్ బైక్ ను తన స్నేహితుడు ప్రిన్స్ అనుమతి లేకుండా ‘జంజీర్’ సినిమాలోని పాటలో ఉపయోగించాడు. స్నేహితుడే కదా అనుకుని  ఆ విషయం అపూర్వ ప్రిన్స్ కు చెప్పలేదట. ఇది జరిగిన చాల కాలానికి సినిమా ట్రైలర్ లో రామ్ చరణ్ తో పాటు తన బైక్ ఉండేసరికి షాక్ అయిన ప్రిన్స్ అపూర్వ లఖియాను నిలదీసి తన బైక్ వాడు కున్నందుకు నష్టపరిహారం ఇమ్మంటూ గొడవ చేయడమే కాకుండా ఆ సినిమా నిర్మాతకు లీగల్ నోటీసు ఇచ్చాడట.

ఈ విషయాన్ని లైట్ గా నిర్మాత తీసుకోవడంతో ప్రస్తుతం ఈ విషయం పై న్యాయస్థానానికి వెళ్లి భారీ మొత్తం అపరాదంగా వసూలు చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టడంతో రిలీజ్ కు దగ్గర పడిన ఈ సినిమాకు ఈ గొడవలు ఏమిటీ అని దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట. మెగా కుటుంబ సినిమాలను రాజకీయ ఉద్యమాలు అడ్డుకుంటు ఉంటే తానేమి తక్కువ కానంటు ఒక మోటార్ బైక్ కూడా చెర్రీ పై పగ పట్టింది..

మరింత సమాచారం తెలుసుకోండి: