బిగ్ బాస్ సెకండ్ సీజన్ ముగింపుకు వస్తున్నా కొద్ది వారం వారం నామినేషన్స్ రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా కౌశల్ ను ఈ సీజన్ మొత్తం నామినేట్ చేయగా తనీష్, రోల్ రైడా, గీతా మాధురిలు నామినేషన్స్ లో ఉండరని బిగ్ బాస్ చెప్పారు. ఇక మిగిలిన వారిలో అమిత్, శ్యామలా, దీప్తి, సామ్రాట్ లలో కౌశల్, తనీష్ లు సామ్రాట్ ను సేవ్ చేశారు.


ఇద్దరు సేవ్ చేశారు కాబట్టి సామ్రాట్ కూడా నామినేషన్ ప్రక్రియలో లేడు. ఇక ఈసారి నామినేషన్స్ లో కౌశల్ డైరెక్ట్ నామినేట్ అవగా అమిత్, శ్యామలా, దీప్తిలు ముగ్గురు నామినేట్ అవడం జరిగింది. దీప్తిని గీతా మాధురి, అమిత్ ను రోల్ రైడా సేవ్ చేశాడు. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ సర్ ప్రైజింగ్ గా అనిపించింది.


కౌశల్ డైరెక్ట్ నామినేట్ అవడం మంచిదే అయింది లేకుంటే ఇంటి సభ్యులంతా కౌశల్ నే టార్గెట్ చేసేవారు. ఈ రకంగా గీతా మాధురి మంచి పనే చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరవుతారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అమిత్, శ్యామలా, దీప్తి, కౌశల్ నామినేషన్స్ లో ఉన్నారు.


కౌశల్ ఎలాగైనా బయట పడతాడు. ఇక ఎటొచ్చి అమిత్, దీప్తి, శ్యామలాకే రిస్క్ ఎక్కువ ఉంది. అయితే ఈసారి వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక అమిత్ లాస్ట్ వీకే తప్పించుకున్నాడు కాబట్టి ఈసారి కన్ ఫాం గా వచ్చేస్తాడని తెలుస్తుంది. ఇక మరో పక్క సెకండ్ ఎలిమినేషన్ శ్యామలా అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. దీప్తి నల్లమోతు మీద అందరికి సింపతీ ఉంది కాబట్టి అది వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: