ఆదివారం రాత్రి జరిగిన ‘టాక్సీవాలా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ వ్యక్త పరిచిన కోరికను విజయ్ దేవరకొండ నిర్ఘాంతపోయాడు. అల్లు అర్జున్ విజయ్ దేవరకొండల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి చిహ్నంగా జరిగిన ఈ ఫంక్షన్ లో బన్నీ విజయ్ ను ఒక కోరిక అడిగి ఆకోరికను త్వరలో తీర్చమని అభ్యర్ధించాడు.
విజయ్ సినిమాలలో నటిస్తూనే ఒక గార్మెంట్ కంపెనీని మొదలుపెట్టి ‘రౌదీస్’ అన్న బ్రాండ్ పేరుతో రకరకాల తీ. షర్ట్స్ జీన్స్ మార్కెట్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి బన్నీ పరోక్షంగా ప్రస్తావిస్తూ ఈసారి తాను విజయ్ దేవరకొండ నటించిన మరొక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా వచ్చే సమయానికి తనకు బాగా అందాన్ని ఇచ్చే ఒక మంచి డ్రెస్ ను డిజైన్ చేయించి తనకు బహుమతిగా ఇమ్మని విజయ్ ను కోరడంతో ఈ ఊహించని రిక్వెస్ట్ కు కొద్ది క్షణాల పాటు నిర్ఘాంతపోయాడు విజయ్.
ఇదే ఫంక్షన్ లో వ్యక్తిత్వం గురించి బన్నీ మాట్లాడుతూ విజయ్ ‘సెల్ఫ్ మేడ్ స్టార్’ గా విజయ్ ఎదిగాడని అలాంటి అదృష్టం కొద్దిమందికి మాత్రమే దక్కుతుంది అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక ‘గీత గోవిందం’ సినిమా గురించి మాట్లాడుతూ తాను ఆసినిమాలో నటించినా విజయ్ స్థాయిలో అందర్నీ మెప్పిమ్చాలేను అంటూ మరొకసారి ఆమూవీ అవకాశం తనకు వచ్చిన విషయాన్ని పరోక్షంగా తెలియచేసాడు.
గీత గోవిందం’ సినిమా ఫంక్షన్ లో చిరంజీవి విజయ్ ను కాబోయే సూపర్ స్టార్ అంటూ ప్రశంసించడం ఇప్పుడు లేటెస్ట్ గా అల్లు అర్జున్ విజయ్ ను ‘సెల్ఫ్ మేడ్ స్టార్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్న నేపధ్యంలో విజయ్ ని మెగా ఫ్యామిలీ తమ కుటుంబ సభ్యుడుగా భావించి ప్రమోట్ చేస్తున్నారా అని అనిపించడం సహజం. అయితే ఎంత మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా ప్రేక్షకులకు సినిమాలు నచ్చకపోతే ఘోరమైన ఫ్లాప్ లుగా మారుతున్న నేపధ్యంలో విజయ్ అదృష్టాన్ని ‘టాక్సీవాలా’ ఈవారం అతడి జాతకాన్ని చెప్పబోతోంది..