సినిమా రంగం చాలా విచిత్రమైంది. ఎవరికీ ఎప్పుడు క్రేజ్ ఏర్పడుతుందో, ఆ క్రేజ్ ఎంత కాలం ఉంటుందో ఎవరికీ తెలియని ఫజిల్ గా ఉంటుంది. ఆ ఫజిల్ ను పూడ్చే శక్తి భగవంతుడికి కూడా లేదేమో అని అనిపిస్తుంది. సహజంగా సినిమాలలో రాణించడానికి లక్ కావాలంటారు. ఆ లక్ ఉన్నప్పుడు ఎన్ని మ్యాజిక్ లు చేసినా చెల్లుతాయి. హీరోకైనా హీరోయిన్ కైనా ఇమేజ్ బాగున్నప్పుడు ప్రతివారు వారిచుట్టూ తిరుగుతూ భజన చేస్తూ ఉంటారు. అయితే కొద్దిగా విధి వక్రించినప్పుడు వీరిని పట్టించుకొనే వారే ఉండరు. ప్రస్తుతం ఒకప్పుడు టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ పరిస్థితి అలాగే ఉంది.

ఈ సంవత్సరం రెండు హిట్ సినిమాలలో నటించినా కాజల్ పట్ల ఏ టాప్ హీరో పెద్దగా ఆశక్తి చూపడం లేదు. కాజల్ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కు కూడా వరస పెట్టి బుకింగ్స్ వచ్చాయి. నిషా నటించిన మొదటి సినిమా ఫ్లాప్ అయినా మళ్ళీ అదే సినిమా హీరో వరుణ్ సందేశ్ తో ‘సరదాగా అమ్మాయితో’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ నుండి నిషా వరుణ్ తో డేటింగ్ చేస్తుంది అనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సీరియస్ గా తీసుకున్న అక్క కాజల్ వరుణ్ తో ఈ వ్యవహారం సెటిల్ చేద్దామని ప్రయత్నించినా వరుణ్ సరిగ్గా స్పందించకపోవడంతో ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసి పెట్టమని టాలీవుడ్ లోని ప్రముఖులందరికీ ఫోన్ చేసి మరీ రిక్వెస్ట్ చేస్తోందట.

అయినా ఎవరూ ఈ మగధీర సుందరి కి స్పందించకుండా ఆమె ఫోన్ కు కూడా అందుబాటు లోకి రావడంలేదట. దీనితో షాక్ కు గురి అయిన కాజల్ ఒకప్పుడు తనను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటూ బుజానికి ఎత్తుకొని మోసిన టాలీవుడ్ ఇండస్ట్రీ ఇదేనా అంటూ ఆశ్చర్య పోతోందట. క్రేజ్ ను బట్టి పరిస్థితులు ఎలా మారిపోతాయో కాజల్ కు ఇప్పుడు తెలిసివస్తుంది కాబోలు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: