‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో ఒకేసారి స్టార్ డమ్ ను అందుకున్న కార్తికేయ మొన్న విడుదలైన ‘హిప్పీ’ మూవీ పై చాల అంచనాలు పెట్టుకున్నాడు. అంతేకాదు ఈసినిమాను చాల కష్టపడి ప్రమోట్ చేయడమే కాకుండా మీడియా దృష్టి ఆకర్షించడానికి ఈమూవీ ఫంక్షన్ స్టేజ్ పై తాను వేసుకున్న షర్ట్ తీసివేసి మీడియా కెమెరాలకు హాట్ టాపిక్ గా మారాడు. 

కార్తికేయ ఇంత కష్టపడినా ఎన్ని లిప్ లాక్ సీన్స్ చేసినా ‘హిప్పీ’ ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. దీనితో ఈ యంగ్ హీరో భవిష్యత్ ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తికేయ తనకు ఏర్పడిన ఇమేజ్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

తన తొలి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రెండో సినిమా విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని చెపుతూ తన వయసుకు తగ్గట్టే రొమాంటిక్ లవ్ స్టోరీలే చేయాల్సి వస్తోందని వివరించాడు. ఇక తదుపరి సినిమాల గురించి వివరణ ఇస్తూ ‘హిప్పీ’ తర్వాత మూడు సినిమాలు క్యూలో ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. 

అయితే తాను కొన్ని పెద్ద బ్యానర్ల నుంచి అడ్వాన్సులు తీసుకున్నా ఆసినిమాలు కుదరలేదనీ దర్శకులు మారడంతో అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేసిన విషయాలను వివరించాడు. అయితే ఇలా ఎందుకు జరిగింది అన్న విషయమై క్లారిటీ ఇవ్వకుండా  సమాధానాలు దాట వేసాడు.    దీనితో రానున్న రోజులలో కార్తికేయ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలకు మాత్రమే సరిపోతాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏమైనా ‘హిప్పీ’ పరాజయం కార్తికేయకు అనుకోని షాక్ అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: