రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఇంకా పిల్లలు పుట్టకపోయినా ఆడపిల్ల పుట్టింది అంటూ ఉపాసన చేస్తున్న హడావిడి మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇంట్లో పిల్లలు పుడితే మొదట ఆలోచించేది వారికి ఏ పేరు పెడదాము అన్న విషయం పై అందరి ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి కోడలు కూడ అదేపనిలో చాలా బిజీగా ఉంది. 

ఇక వివరాలలోకి వెళ్ళితే  ఉపాసన ఇంటికి కొత్త మెంబర్ వచ్చాడట.  ఆ మెంబర్ ఒక గుర్రం పిల్ల.  ఈ విషయాన్ని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఆ మెగా పిల్ల గుర్రానికి మంచి పేరు సూచించ వలసిందిగా ఆమె మెగా అభిమానులను కోరుతోంది. అంతేకాదు  పిల్లగుర్రం ఫోటోను తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి మరీ అభిమానులను పేరు సజెస్ట్ చేయమని మెగా అభిమానులను కోరడంతో అభిమానులు పోటీలు పడి మరీ పేర్లు సూచిస్తున్నారు. 

చాందిని – బేబీ – రాణి – సోని – కాజోల్ - రీనా.. గ్రేసీ.. హార్వీ.. బంగారం – సనా - మిస్సీ అంటూ చాలా పేర్లు ఇప్పటికే ఉపాసనకు సూచింపపడ్డాయి. అంతేకాదు ఈపిల్ల గుర్రం ఎంతో అందంగా ఉందని చాలామంది ప్రశంసలు కురిపిస్తున్న నేపధ్యంలో ఉపాసన మంచి జోష్ లో ఉంది.  చరణ్ ఉపాసనలకు జంతువులంటే విపరీతమైన ప్రేమ ఉండటంతో వారి ఫాం హౌస్ నిండా అనేక జంతువులు పక్షులతో నిండి పోయింది. 

ఈ జంతువులను చూసు కోవడానికి చరణ్ ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులను పెట్టాడు అంటే చరణ్ ఉపాసనలకు జంతువల పై ఉన్న ప్రేమ అందరికి తెలుస్తుంది. ప్రస్తుతం ఈవార్తలు ఇలా మీడియాలో హడావిడి చేస్తుంటే కొందరు మెగా అభిమానులు మాత్రం "వదినమ్మా.. ఈ పిల్లగుర్రం సంగతి సరే..జూనియర్ చరణ్ ఎప్పుడు వస్తాడు?" అంటూ వారసుడి ప్రస్తావన తీసుకువస్తున్నారు. అయితే ఉపాసన ఈవిషయమై అనేకసార్లు స్పందిస్తూ తాము ఇంకా పిల్లలు  కనడానికి మానసికంగా సిద్ధంగా లేను అని చెప్పిన విషయాలు తెలిసినవే..  



మరింత సమాచారం తెలుసుకోండి: