సినిమా ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో కొంతమంది సక్సెస్ అవ్వగా... ఎక్కువమంది బొక్కబోర్ల పడ్డారు. అసలు నిర్మాతల కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చే ట్రెండ్ మొదలైంది మన విక్టరీవెంకటేష్ తోనే.. విజయాన్నే తన ఇంటి పేరుగా మార్చుకొని స్టార్ గా కొనసాగుతున్నారు వెంకటేష్. సినిమా థియేటర్ కి వచ్చే అభిమానులని పడి పడి నవ్వించాలన్న ... భారీ యాక్షన్ తో అకట్టుకోవాలన్న కూడా అది ఒక్క వెంకటేష్ కే చెల్లుతుంది. స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ ...చాలా తక్కువ కాలంలోనే అగ్ర హీరోగా మారిపోయాడు. టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ లో వెంకీ కూడా ఒకరు.
వెంకీ కి సెట్ అయ్యే కథ పడితే వెంకీని ఎవరూ అందుకోలేరు.

ఈ విషయం ఈ మద్యే వచ్చిన f2 కూడా నిరూపించింది. F2 లో వెంకీ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే వెంకీ కెరియర్ లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ ఉన్నాయి. వాటిల్లో " నువ్వు నాకు నచ్చావ్" ఒకటి. వెంకటేష్ లైఫ్ లో ఈ సినిమా బిగెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ అని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఆర్తి అగర్వాల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కి అడుగుపెట్టింది.

ఈ సినిమా విజయ భాస్కర్ డైరెక్షన్లో  తెరకెక్కింది.  ఈ బిగెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ విడుదల అయ్యి  నేటికి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సినిమా కథ విషయానికొస్తే .... ఉద్యోగం కోసం తండ్రి .. ఫ్రెండ్ ఇంటికి వచ్చిన ఒక అబ్బాయి జీవితంలో జరిగిన అనేక మార్పుల సమూహంతో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా మొదట్లో నే హీరోయిన్ కి అమెరికా అబ్బాయి తో నిచ్చితార్థం అయిపోతుంది. ఈ సమయంలో ఆ ఇంటికి వచ్చిన వెంకీ ని ఆర్తి అగర్వాల్ చిన్నగా ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. సినిమా ఒక వైపు పూర్తి కామెడీ గా సాగుతున్నప్పటికి ... మరో వైపు వీరిద్దరికి లవ్ యాంగిల్ కూడా అందరిని ఆకట్టుకుంటుంది.

ఇక చివరగా ...వీరి ప్రేమ వ్యవహారం తెలిసి పెళ్లి పీటల పైన పెళ్లి ఆపేసి వెళ్లిపోతున్నా పెళ్లి వారిని వెళ్ళద్దు అంటూ కాళ్ళమీద పడటానికి కూడా సిద్ధమౌతాడు వెంకీ. ఆ సమయంలో వెంకీ లో ఉన్న గొప్పతనం గుర్తించిన ప్రకాశ్ రాజ్ ...నందుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మధ్యలో బ్రహ్మి కామెడీ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు . వాటర్ వరల్డ్ లో బ్రహ్మీ  ట్రైన్ సీన్ ఇప్పుడు చూసి కూడా అదే రేంజ్ లో నవ్వుకుంటూ ఉంటారు వెంకీ అభిమానులు .ఈ సినిమాకి ప్రస్తుత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , మాటలు రాసారు. త్రివిక్రమ్ పంచ్ లకి వెంకీ కామెడీ కి సరిగ్గా సూట్ అయ్యి అదిరిపోయింది. ఇక ఈ సినిమాలో హైలెట్ సీన్ అంటే .... అందరూ భోజనం చేస్తున్న సమయంలో వెంకీ చేసే పూజ ... ఆ తరువాత ప్రకాశ్ రాజ్ అమ్మ పై రాసిన కవిత . .ఒక్కసారి వింటే ఎవరైనా కూడా జీవితంలో మరచిపోలేరు. వారిద్దరి మధ్య ఆద్యంతం కామెడీ సాగింది.. దానితో సినిమా  రేంజు మరో స్థాయికి వెళ్లిందని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: