ఇప్పటి వరకు అమెరికాలో ఉన్న రానా అక్టోబర్ మొదటి వారంలో ఇండియా రాబోతున్నాడు. రానాకు కిడ్నీ ఆపరేషన్ జరిగినప్పటికీ ఆ విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా రానా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు అయితే రానా అమెరికాలో ఇన్ని వారాలు ఎందుకు ఉన్నాడో అన్న విషయం క్లారిటీ కూడ ఇవ్వలేకపోతున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో అక్టోబర్ మొదటి వారంలో రానా హైదరాబాద్ కు తిరిగి వచ్చిన వెంటనే ఒక భారీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తనకు ఎటువంటి సర్జరీలు జరగలేదనీ ప్రకటించబోతున్నట్లు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు అదే మీడియా సమావేశంలో రానా తాను నిర్మాతగా మారి వెంటనే మొదలుపెట్టబోతున్న 5 చిన్న సినిమాల విశేషాలను ఆ మీడియా సమావేశంలో తెలియచేస్తాడని ఆ కథనంలో పేర్కొనబడింది.

అంతేకాదు భవిష్యత్ లో సంవత్సరానికి 10 చిన్న సినిమాలు తీయడం తన ధ్యేయం అని చెపుతూ ఇప్పటికే అనేకమంది యంగ్ టాలెంటెడ్ రైటర్స్ డైరెక్టర్స్ తో కూడిన తన టీమ్ వివరాలను తెలియచేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం తాను నటించవలసి ఉన్న ‘విరాటపర్వం’ మూవీని మాత్రం పూర్తిచేసి ఇక  భవిష్యత్ లో తన దృష్టి అంతా నటన పై కన్నా ఫిలిం మేకింగ్ పై పెట్టబోతున్నట్లు రానా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 

దీనితో రానున్న రోజులలో నటుడుగా కన్నా రానా నిర్మాతగా బిజీ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. తన ఆరోగ్యం గురించి ఎన్నో విధాలుగా వచ్చిన వార్తలకు డైరెక్ట్ గా సమాధానం ఇవ్వకుండా ఇలా చాల వ్యూహాత్మకంగా మీడియా దృష్టిని తాను నిర్మాతగా మారి నిర్మించబోతున్న చిన్న సినిమాల వైపు డైరెక్ట్ చేసి ఇక తన ఆరోగ్యం గురించి మీడియాలో వార్తలు రాకుండా రానా తెలివిగా వ్యవహరిస్తున్నాడు అనుకోవాలి..     



మరింత సమాచారం తెలుసుకోండి: