క్యూట్ బ్యూటీ సమంత ఓ డేరింగ్ స్టెప్ తీసుకుంది. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఆమె చేసిన ప్రయత్నం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. తాజాగా ఆమె నటించిన 'డాబర్ వాటికా' హెయిరాయిల్ వాణిజ్య ప్రకటనకు తానే వాయిస్ ఇచ్చుకుని అందర్నీ అదరకొట్టిoది. దీనిని బట్టి చూస్తే, ఇకపై సమంత తన సినిమాలకు తానే డబ్బింగు చెప్పుకుంటుందా అనే అనుమానాలు చాలామందికి వస్తున్నాయి.  సమంత తన తొలిసినిమా 'ఏ మాయ చేసావే' నుంచీ కూడా సమంతాకు మంచి హస్కీ వాయిస్‌తో శ్రీపాద చిన్మయి డబ్బింగ్ చెబుతూ వస్తోంది. ఆ స్వీట్ వాయిస్ సమంతాదేనా అన్నంతగా చిన్మయి మాట సమంతకు నప్పింది. ఈ నేపధ్యంలో సమంతకు డబ్బింగు మీదకు కూడా మనసు మళ్ళింది. అయితే తన అభిమానులు కూడా చిన్మయి వాయిస్‌కు అలవాటు పడిపోవడంతో డబ్బింగ్ చెప్పుకునే ధైర్యం చేయలేకపోతోంది ఈ మాయలేడి. ప్రస్తుతం సమంత తెలుగు కూడ ధారాళంగా మాట్లాడగలుగుతున్నా చిన్మయిని తనకు డబ్బింగ్ చెప్పే అవకాసాల నుండి తాను తప్పించనని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కామెంట్ కూడా చేసింది.  అయితే ఈమాటలు చెప్పిన కొద్దిరోజులకే సమంత ఇప్పుడు వాణిజ్య ప్రకటనకు తనకు తానే డబ్బింగ్ చెప్పడం చూస్తే, త్వరలోనే సినిమాలకు కూడా ఇదే అలవాటును కొనసాగిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సమంత కొత్త అలవాటుతో చిన్మయికి గట్టి షాక్ తగిలింది అనే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: