వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు వచ్చిన పరిస్థితి ప్రస్తుతం రాజ్యంలో కడప రెడ్లు సినిమాకి కూడా రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తుంది . అయితే  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా టిడిపి పార్టీ పై టీడీపీ అధినేత చంద్రబాబుపై గుర్రుగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో అప్పట్లో చంద్రబాబును గట్టిగానే టార్గెట్ చేసాడు. టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ని ఎలా వెన్నుపోటు పొడిచి  పార్టీని లాగేసుకున్నాడో  నిజాలు చెబుతాను అంటూ వర్మ సంచలన రేపాడు . దీంతో అప్పట్లో తెలుగు తమ్ముల్ల  ఆగ్రహానికి గురయ్యాడు. ఇక చివరికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్ లో విడుదలకు  కాస్త ఇబ్బందే ఎదురైందని చెప్పాలి. 

 

 

 

 ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో మరో సంచలనాత్మక చిత్రానికి తెరలేపాడు రాంగోపాల్ వర్మ. ఈ వివాదాస్పద చిత్రాన్ని  కూడా ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి.ఈ  సినిమా రాష్ట్రంలోని ప్రజల మధ్య కుల చిచ్చు రేపేలా ఉందంటు  హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన హైకోర్టు వర్మ కి భారీ షాక్ ఇచ్చింది. అటు సెన్సార్ బోర్డు కూడా వర్మకు గట్టిగానే షాక్ ఇచ్చింది. ఈనెల 29న విడుదల కావాల్సిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. కారణం సెన్సార్ బోర్డు ఈ సినిమాకి ఇంకా ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వలేదు . అయితే సెన్సార్ బోర్డు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలోని అన్ని సీన్ లను పరిశీలించి అభ్యంతరకర సీన్ల  గురించి తెలపాలని హైకోర్టు ఆదేశించింది. 

 

 

 

 దీంతో ఈ చిత్రం అనుకున్న సమయానికి రావడం కష్టంగా మారింది. సెన్సార్ బోర్డు తాజాగా  రివైజింగ్ కమిటీకి వెళ్లాల్సిందిగా వర్మకు సూచించింది. ఈ సినిమా విషయంలో ఏదైనా అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే రివైజింగ్  కమిటీ చూసుకుంటుందని  వర్మ కు సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పారు.దీంతో  వర్మ కూడా సినిమా విడుదల విషయంలో ఏం చేయలేక పోతున్నారు. కాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా భవితవ్యం ఏమిటో తెలియడానికి ఇంకో వారం రోజుల సమయం పట్టేటట్లు కనిపిస్తోంది. ఒకవేళ సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ వచ్చినప్పటికీ తెలుగు తమ్ముళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను విడుదలను అడ్డుకునేలా కనిపిస్తున్నారు  . ఈ క్రమంలో గతంలో వలె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా ఆలస్యంగా విడుదల అవుతుందా అనే సందేహాలు కూడా తెర మీదకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: