నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్న సంగతి విదితమే. అయితే.. వరుణ్ ఇప్పటికే ముంబై, అమెరికాలో బాక్సింగ్ గురించి శిక్షణ పొందాడు. ఇప్పుడు వరుణ్ తన బాహువులతో చూడటానికి అదిరిపోయాడు. కొత్త కొత్త టెక్నిక్ తో ప్రత్యర్ధుల పై పంచ్ లు ఎలా విసరాలనే దానిపై పూర్తి స్థాయిలో శిక్షణను పూర్తిచేసాడట. ఇక ఆ సినిమా సెట్స్ కు పైకి వెళ్లడమే ఆలస్యం. కాగా., ఈ చిత్రంను కొర్రపాటి కిరణ్ అనే కొత్త అతను డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. కాగా., డైరెక్టర్ కిరణ్ ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. 


అయితే.. క్రమంలో ఈ సినిమాలో ఓక ప్రత్యేక పాత్ర కోసం కన్నడ స్టార్ ఉపేంద్రను రంగంలోకి దింపాలని చర్చలు జరుపుతున్నారట. దీనికి గాను అతన్ని సంప్రదించే పనిలో పడ్డారట. స్క్రిప్ట్ పరంగా ఆ ప్రత్యేకమైన రోల్ కు ఉపేంద్ర అయితే పర్ పెక్ట్ గా సెట్ అవుతాడని చిత్ర యూనిట్ భావిస్తోందట. మరి దీనికి కన్నడ స్టార్ ఉపేంద్ర ఇంకా అంగీకరించాడా లేదా.. అన్న విషయంలో క్లారిటీ రాలేదు. ఉపేందర్ కి సెట్ అయ్యే ఆ ప్రత్యేక రోల్ బాక్సర్ తో పోటీ పడటానికా..? లేక గతంలో బన్నీ హీరోగా నటించిన సన్నాఫ్ స్యత మూర్తిలో ఉపేందర్ దేవరాజులాంటి రోల్ చేస్తున్నాడా అన్నది ఇంకా తెలియ రాలేదు. 


ఇక ఉపేంద్ర కొన్నేళ్లగా కన్నడ సినిమాలకే పరిమితమయ్యారు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వచ్చినా నటించడం లేదు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఆ కీలక పాత్ర కోసం త్రివిక్రమ్ ఉపేందర్ ని బలవంతం చేయటం వల్లనే ఆ పాత్ర చేయాల్సి వచ్చిందట. 


సినిమా తర్వాత ఎలాంటి ఆఫర్లు వచ్చినా ఉపేందర్ అంగీకరించలేదు. మరిప్పుడు వరుణ్ తేజ్ తో నటిస్తాడా..?? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మరోసారి మెగా హీరోతో నటించే ఛాన్స్ ను చేస్తాడా లేక వదులుకుంటాడో అన్న విషయం చూడాల్సిందే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: