ఫిలిం ఇండస్ట్రీ సర్కిల్స్ లో కొన్ని వార్తలు ఎలా లీక్ అయ్యాయి అన్న విషయమై క్లారిటీ లేకపోయినా బయటకు వచ్చే వార్తలు మటుకు చాల మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. 

 

కళ్యాణ్ రామ్ తారక్ ను ‘డాడీ’ అని పిలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండటమే కాకుండా నిజంగా వీరిద్దరూ ఒకే తల్లికి పుట్టిన పిల్లలా అని అనిపించే విధంగా వీరిద్దరి సాన్నిహిత్యం ఉంటుంది. దీనికితోడు కళ్యాణ్ రామ్ కు వచ్చే ఏ సమస్యకు అయినా జూనియర్ అండగా ఉంటూ ఈ అన్నదమ్ముల అనుబంధం అందర్నీ ఆకర్షించే విధంగా ఉంటుంది. 

 

కళ్యాణ్ తన తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పెట్టి అనేక సినిమాలు తీయడమే కాకుండా జూనియర్ తో ‘జై లవ కుశ’ మూవీ తీసాడు.  ఆ మూవీ తరువాత మళ్ళీ కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లోని త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ తో హారికా హాసిని సంస్థతో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాను తీస్తున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే జూనియర్ నటించబోయే 31వ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర నీస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో సందడి చేస్తోంది. 


తెలుస్తున్న సమాచారం మేరకు జూనియర్ నటించబోయే31వ సినిమా నుంచి అతడు నటించే ప్రతిసినిమా తారక్ సొంత బ్యానర్ లోనే తెరకెక్కనున్నాయట. అందుకోసం జూనియర్ స్వయంగా నందమూరి హరికృష్ణ ఆర్ట్స్ బ్యానర్ ని ప్రారంభిస్తున్నట్లు టాక్.భవిష్యత్ లో జూనియర్ సినిమాలు అన్నీ ఈ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ సమర్పణ లో వస్తాయని ఈ సినిమాలకు సంబంధించి జూనియర్ పారితోషికం తీసుకోకుండా తన సినిమాల లాభాలలో కీలక వాటా తీసుకుంటాడని టాక్. ఇక హరికృష్ణ పేరు మీద ప్రారంభించే ఈ బ్యానర్ కి ఎన్.హెచ్.కె ఆర్ట్స్ అనే షార్ట్ టైటిల్ ని ప్లాన్ చేసారట. అయితే జూనియర్ స్థాపించబోయే ఈ ప్రొడక్షన్ హౌస్ లో కళ్యాణ్ రామ్ కు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని ఎటువంటి పాత్ర ఉండదు అన్న గాసిప్పులు వస్తున్నాయి. దీనితో కళ్యాణ్ రామ్ భవిష్యత్ లో ఇక తారక్ తో సినిమాలు తీసే అవకాసం లేదా అంటూ కొందరు ఈ గాసిప్పులను ఆధారంగా చేసుకుని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఇది అంతా జూనియర్ కళ్యాణ్ రామ్ లు అంటే గిట్టని వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం అంటు ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: