బాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అంటే అందరికి ముందు గుర్తొచ్చేది క్వీన్ కంగనా రనౌత్ మాత్రమే. ఇంటి నుంచి వచ్చేసి ముంబై లో ఎన్నో కష్టాలుపడి తిండి లేని రాత్రులు గడిపిన కంగన ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలుగుతోంది. అంతేకాదు కొన్ని కథలకి కంగన తప్ప మరెవరూ సూటవరు అన్నంతగా క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బాలీవుడ్ లో చలామణి అవుతున్న కంగన అమ్మ జయలలిత బయోపిక్ లో నటిస్తుంది. ఇక ఎప్పుడు అవతల వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే, లేదా మాట్లాడితే అందరికంటే ముందు స్పందించే కంగనా చాలా కాలానికి తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయట పెట్టింది.
కంగన .. తను చాలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తినంటూ .. తన స్వతంత్ర భావాలు ఏ స్థాయిలో ఉంటాయంటే... తను ఎవరి పక్కనా క్యాజువల్ గా కూడా పడుకోలేనంటూ ఈ ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది. షూటింగ్ కోసం అవుట్ డోర్ వెళ్ళినా తన బెడ్ సెపరేట్ గా ఉండాలని, తనకి ప్రైవసీ కావాలని వెల్లడించింది. అంతేకాదు ఎవరితోనూ బెడ్ ను పంచుకోవడం కూడా ఇష్టం లేదంటూ కంగనా రనౌత్ తెలిపింది. ఎప్పుడైనా సరదాగా క్యాజువల్ డేట్ కి వెళ్లి ఎవరితోనైనా కాసేపు బెడ్ మీద పడుకున్నా.. ఆ తర్వాత ఏ అర్ధరాత్రో తను లేచి వేరే బెడ్ మీదకు వెళ్లిపోవడం అలవాటట. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలో ఒకసారి ఊహించుకోండి.
అంతేకాదు తన స్వతంత్ర భావాలకు నిదర్శనంగా మరికొన్ని షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చింది కంగనా. కొంతమంది హీరోల సరసన సినిమాల్లో నటించడానికి ఎంతమాత్రం ఒప్పుకోదట. ఇది కూడా తన గొప్పగా చెబుతోంది. 'సంజూ'లో రణ్ బీర్ కపూర్ సరసన, 'సుల్తాన్' లో సల్మాన్ ఖాన్ సరసన అవకాశాలు ముందుగా తనకే వచ్చాయని, అయితే వాటిని తను కావాలనే రిజెక్ట్ చేసినట్టుగా తెలిపింది. మొత్తానికి తనకి డేటింగ్ వెళ్ళే అలవాటుందన్న విషయం ఇలా రివీల్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఎవరైనా పరిస్థితులని బట్టి మారక తప్పదని అర్థం చేసుకోవచ్చు.