కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేసేసింది. ఎవరికి వారు ఇళ్లలోనే ఉండిపోయారు. ఇంట్లో ఉండి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూనే ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. పుస్తకాలు చదవడం, పాత సినిమాలు చూడడం, తమ హాబీలను మళ్లీ గాడిలో పెట్టడం, ఇంటి పనులు చేయడం చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలైతే చెప్పే పని లేదు. తమ ఇళ్లలో అంట్లు తోమడం, ఇల్లు ఊడవటం, బాత్రూమ్ క్లీనింగ్ వంటి పనులు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.

 

 

ఇందుకు ఆర్ఎక్స్ పాప రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఏమీ మినహాయింపు కాదు. ఈ క్వారంటైన్ టైమ్ లో తాను ఏం చేస్తుందో ఓ ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అప్లోడ్ చేసింది. ఓ పక్క యోగా మ్యాట్ మీద యోగా చేసే సమయంలో ఉన్న ఫొటో.. మరో పక్క ఓ క్లాత్ తో ఇల్లు తుడుస్తూ ఉన్న ఫొటోను అప్లోడ్ చేసింది. దీనికి క్వారంటైన్ టైమ్ అని పేరు కూడా పెట్టుకుంది. ఇదే జీవితం అంటూ రాసుకుంది. ఈ రెండు ఫొటోల్లోనూ చలా గ్లామరస్ గా ఉన్న పాయల్ పాప ప్రస్తుతం తన డైలీ లైఫ్ ఇదే అంటూ హింట్ కూడా ఇచ్చినట్టైంది. హెడ్ బ్యాండ్ తో ఉన్న ఫొటోలో మంచి కలర్ ఉన్న డ్రెస్ వేసి చాలా బబ్లీగా ఉంది.

 

 

ఈ పిక్ ను ఆమె మొదటి దర్శకుడు అజయ్ భూపతి కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అయింది. ‘ఆర్ఎక్స్ 100 హీరోను పెళ్లి చేసుకుంటే ఈ బాధలు తప్పేవిగా’, ‘నాచురల్ సెక్సీ బ్యూటీ’ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు లేకపోయినా తమిళ్ లో ఏంజెల్ అనే సినిమా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: