రష్మిక మందన కు ఈ మధ్య కాలంలో భారీగా డిమాండ్ పెరిగింది. తెలుగులో ఆమె సినిమాలకు ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఆమెకు అంటూ ఫాన్స్ కూడా ఉన్నారు. ఈ ఏడాది మహేష్ బాబు తో ఒక సినిమా నితిన్ తో ఒక సినిమా ఆమె హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు వసూళ్ళ పరంగా మంచి విజయ౦ సాధించాయి. దీనితో ఆమెను కమర్షియల్ హీరోయిన్ అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె సినిమాలకు ఇక్కడి నుంచి కమర్షియల్ కోణం అనే గుర్తింపు వచ్చింది. ఆమె చేస్తే ఇప్పుడు అలానే చేస్తాను అంటుంది అంటున్నారు. 

 

అవును ఇప్పుడు ఆమె చేసే సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ గానే ఉంటున్నాయి అనేది వాస్తవం. ఇప్పుడు తమిళంలో ఒక సినిమాను ఆమె ఓకే చేసింది. ఆ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది. కన్నడం లో కూడా అలాంటి సినిమానే ఆమె ఓకే చేసింది. ఆ సినిమా కూడా కమర్షియల్ గానే ఉంటుంది. ఇక తెలుగు సినిమాల విషయంలో ఆమె ఇప్పుడు ఇదే కోణంలో ఆలోచన చేసి ఇక్కడి సినిమాలను కాస్త చిన్న చూపు చూస్తుంది అంటున్నారు టాలీవుడ్ జనం. అవును ఇప్పుడు ఆమె భారీగా రేటు పెంచింది. 

 

దీనితో ఆమె తో సినిమా చెయ్యాలి అనుకునే నిర్మాతలు ఒకటికి పది సార్లు ఆలోచించి సినిమా చేసే పరిస్థితి ఇప్పుడు నెలకొంది అంటున్నారు. చిన్న చిన్న సినిమాలు అయితే తాను అసలు చేసేది లేదు అని ఆమె చెప్పినట్టు సమాచారం. దీనితో చేసేది లేక నిర్మాతలు ఆమె తో పెద్ద సినిమాలే చేస్తున్నారు. అయితే ఆమె బికినీ వేయడానికి డిమాండ్ కూడా చేస్తుంది అంటున్నారు. సినిమాలో బికినీ వెయ్యాలి అంటే కచ్చితంగా భారీగా ఇవ్వాల్సి ఉంటుంది అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని టాలీవుడ్ మొత్తం ఆమె గురించే చర్చలు.

మరింత సమాచారం తెలుసుకోండి: