లాక్ డౌన్ సమయంలో ప్రజలకు కష్టాలు పెరిగిపోతున్న పరిస్థితులలో ఆ కష్టాల నుండి మైమరిపించడానికి అనేక మంది సెలెబ్రెటీలు అనేక ఇంటర్వ్యూలు ఇస్తూ అనేక ఛాలెంజ్ వీడియోలను షేర్ చేస్తూ జనం బాధలు కొద్దిసేపు మర్చిపోయేలా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడ ఆ లిస్టులోకి చేరిపోయి ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు.


ప్రస్తుతం నడుస్తున్న లాక్ డౌన్ పిరియడ్ చాల బోరింగ్ గా ఉందని కరోనా సమస్య రాకుండా ఉండి ఉంటే ఈసమ్మర్ రేస్ లో తన ‘సోలో బతుకే సో బెటర్’ రిలీజ్ అయి ఉండేదని ఇప్పుడు తన సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తనకే తెలియదు అంటూ కామెంట్ చేసాడు. ఇదే సందర్భంలో తాను లాక్ డౌన్ సమయంలో చేస్తున్న మంచి పనులను గురించి కూడ వివరించాడు.


తనకు పుస్తకాలు చదివే అలవాటు తన మామయ్య పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిందని గతంలో ఒకసారి పవన్ తనకు ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ పుస్తకం ఇచ్చినప్పటి నుండి తనకు పుస్తక పఠనం పై ఆసక్తి పెరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ మధ్య తనకు తరుచూ చేస్తున్న ఫోన్స్ గురించి వివరిస్తూ ఈ లాక్ డౌన్ సమయంలో ఏపుస్తకాలు చదవాలో తనకు పవన్ సూచనలు ఇస్తున్నాడని ఆ తరువాత తాను చదివిన ఆ పుస్తకంలోని విషయాలు తన మామయ్యకు చెప్పాలి అంటూ పవన్ తనకు పెడుతున్న స్వీట్ టార్చర్ గురించి నవ్వుతూ చెప్పుకువచ్చాడు.


కరోనా సమస్య  వచ్చిన తరువాత తనకు వేదాంతం పెరిగి పోయిందని రేపు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి తాను రేపటి గురించి ఆలోచించడం మానేసాను అని అంటున్నాడు. ప్రస్తుతం తన ఇంటిలోని పని అంతా తన తల్లి మాత్రమే చేసుకుంటూ ఉండటం తనకు బాథ అనిపిస్తోందని తాను సహాయం చేస్తాను అంటే దానివల్ల తనకు ఇంటిపని రెట్టింపు అవుతుంది అంటూ ఆమె పడుతున్న కష్టాన్ని చూస్తుంటే అందరికీ కరోనా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయో తనకు ఏమి అర్ధం కావడం లేదు అని అంటున్నాడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: