టాలీవుడ్ యువ నటుడు రానా దగ్గుబాటి ఇప్పటికే నటుడిగా మంచి పేరు దక్కించుకుని ప్రస్తుతం వరుసగా అవకాశాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. ముందుగా శేఖర్ కమ్ముల తీసిన లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రానా, ఫస్ట్ సినిమా సక్సెస్ తో మంచి పేరు సంపాదించి ఆపై మరికొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. ఇక ఆపై బాహుబలి సినిమాల్లో భళ్లాలదేవుడిగా రెండు భాగాల్లోనూ ఎంతో గొప్ప నటనను కనబరిచిన రానాకు మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. ఆ తరువాత అటు బాలీవుడ్ లో కూడా రానాకు అవకాశాలు బాగానే రాసాగాయి. 

 

ప్రస్తుతం అరణ్యతో పాటు విరాట పర్వం సినిమాలు చేస్తున్న రానా, నేడు తన లవర్ గురించి అలానే తన లవ్ ని ఆమె ఒప్పుకుందని కాసేపటి క్రితం ఒక సంచలన ట్వీట్ పోస్ట్ చేసి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. తన స్నేహితురాలు మిహీక బజాజ్ తో తాను ఎప్పటినుండో ప్రేమలో ఉన్నానని, అయితే ఇప్పటికి తాను తన ప్రేమను ఒప్పుకుందని రానా ఆమెతో కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసాడు. కాగా ఈ లాక్ డౌన్ ముగిసిన అనంతరం వారిద్దరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. అయితే అలా రానా తన లవ్ గురించి ప్రకటించగానే, ఇలా అనేకమంది సినిమా ప్రముఖులు అతడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 

కాసేపటి క్రితం శృతి హాసన్, హన్సిక, సమంత అక్కినేని, అనుష్క శెట్టి, రామ్ చరణ్ తదితరులు రానాకు రాబోయేరోజుల్లో ఆమెతో గడుపబోయే కొత్త జీవితం మరింత ఆనందంగా ఉండాలని కోరుతూ ట్వీట్స్ చేయగా, కాసేపటి క్రితం రానా ట్వీట్ ని రీట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, కంగ్రాట్స్ రానా మొత్తానికి నువ్వు కూడా ఒక ఇంటివాడివి కాబోతున్నావు. ఈ లాక్ డౌన్ నీకు వెడ్ లాక్ ని తీసుకువచ్చింది, మీ జంట ఇద్దరూ చూడచక్కగా ఉన్నారు శతమానం భవతి అంటూ మెగాస్టార్ పోస్ట్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: